ఏపిలో అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్న విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా అధికార, ప్రతి పక్ష నాయకుల మద్య మాటల యుద్దం తారాస్థాయికి చేరు కుంటుంది.  గతంలో టీడీపీ పాలన ఏ విధంగా చేసిందో ఎన్ని అక్రమాలు..అన్యాయాలకు పాల్పపడిందో అన్న విషయం పై అధికార పక్షం నిలదీస్తుంది. మరోవైపు ఏపిలో ఇప్పటి వరకు వైసీపీ పాలనపై విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు.  ఇదిలా ఉంటే ఈ రోజు డిప్యూటీ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేశారు. దీనిపై సీఎం జగన్ జోక్యం చేసుకున్నారు. 

అసెంబ్లీ రూల్స్ ప్రకారమే నడుస్తుందని.. ఎవరో చెప్పినట్లు సభను నడిపించరని చెప్పారు ఏపీ సీఎం జగన్. స్పీకర్‌ను డిక్టేట్ చేస్తూ మాట్లాడడం సరైన పద్దతి కాదని..తమరు సీనియర్ నేతలు అయి ఉండి కూడా ఇలాంటి విషయాలను తెరపైకి తీసుకు రావడం మంచిది కాదని జగన్ అన్నారు. సానుభూతి కోసం పాకులాడటం మంచి పద్ధతి కాదని..సభలో తప్పకుండా సంప్రదాయాలను పాటించాలన్నారు.

సీట్ల అడ్జెస్ట్ మెంట్ విషయంలో ఎవరూ ఇన్వాల్వ్ కాలేదు..రూల్స్ ప్రకారం సీట్లు కేటాయించినట్లు జగన్ తెలిపారు. అంతేకాదు సభలో జరుగుతున్న డ్రామా చూస్తున్నానని, ప్రతీది కాంట్రవర్సీ చేయడం బాబుకు తగదన్నారు. కేటాయించిన సీట్లలో కూర్చొవాలని స్పీకర్ రూలింగ్ ఇచ్చారన్నారు. స్పీకర్ స్థానానికి ఎవరైనా గౌరవం ఇవ్వాలని ప్రతిపక్షానికి సీఎం జగన్ సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: