జగన్ మీద అభిమానం ఆ ఎమ్మెల్యేకు అలా పొంగిపొర్లుతోంది. అది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే విషయమైనా, బడ్జెట్ ప్రసంగమైనా కూడా తేడా ఏమీ  లేదు, మైక్ దొరికితే చాలు జగన్ కీర్తనను వినిపిస్తున్నాడు. జస్ట్ లో చాన్స్ మిస్ అయింది కానీ ఆయన వైసీపీ ఎమ్మెల్యే అయిపోయేవారుగా.


ఆయనే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. బడ్జెట్ పై ఈ రోజు ఆయన మాట్లాడుతూ, జగన్ నిజంగా వరాలు కురిపించే దేవుడంటూ పొగిడేశారు. సమాజంలో అన్ని వర్గాలకు సంక్షేమం అందించాలన్న తాపత్రయం జగన్ బడ్జెట్లో కనిపిస్తోందని అన్నారు. మచి చేసిన వారిని మెచ్చుకోవాల్సిందేనంటూ జగన్ ది అచ్చంగా వారి నాయన రాజశేఖర్ రెడ్డి బాట అన్నారు.


బడ్జెట్లో పెద్ద ఎత్తుక కేటాయింపులు జరిపి పేదలను ఆదుకోవడానికి జగన్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు హర్షణీయమని రాపాక తెగ పొగిడారు.  పంటల నష్ట పోయి ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబానికి ఏడు లక్షల పరిహారం ఇవ్వాలన్న నిర్ణయం హర్షణీయమని ఆయన అన్నారు.కౌలు రైతులకు ఒప్పందపత్రాన్ని ప్రవేశపెట్టడాన్ని కూడా ఆయన సమర్ధించారు. మొత్తానికి చూస్తూటే రాపాక ఉన్నది జనసేన అయినా మనసు మాత్రం జగన్ తోనే అన్నట్లుగా ఉంది. 


బడ్జెట్ విషయంలో జనసేన  పార్టీ తరఫున అనకాపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన పార్ధసారధి గట్టిగా  విమర్శలు గుప్పించారు. పవన్ అయితే జగన్ని ఏనాడూ కూడా పొగిడిన దాఖలాలు లేవు. మరి రాపాక మాత్రం తన దారి రహదారి అంటున్నారు. జగన్ ది గ్రేట్ అని కూడా అనేస్తున్నారు. ఆయన ఏమన్నా చేసేది ఏమీ కూడా లేదు. ఎందుకంటే జనసేనకు ఆయనే ఏకైక ఎమ్మెల్యే మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: