ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మండిపడ్డారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఒక్క నిజం కూడా చెప్పలేదని ఆరోపణలు చేశారు. 


వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి కనీసం 45 రోజులు కూడా కాలేదు.. ప్రతిపక్ష పార్టీ నేతల నుంచి లెక్కపెట్టలేనన్ని విమర్శలు చేస్తున్నారు. మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో విమర్శలు చేస్తే, తనయుడు నారా లోకేష్ ట్విట్టర్ నే వేధికగా చేసుకొని దారుణంగా విమర్శిస్తున్నారు. 


ఈ నేపథ్యంలోనే ఈరోజు నారా లోకేష్ ట్విట్ చేస్తూ పాదయాత్ర మాటలు అన్ని అబద్ధాలు అని వ్యాఖ్యనించారు. ''పాదయాత్రలో ఒక్క నిజం మాట్లాడని జగన్ గారు ఇప్పుడు అసెంబ్లీలో నిజాలు మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు అని చెప్పారు. 'జాబు రావాలి అంటే బాబు పోవాలి', 'బాబు హయాంలో ఒక్క జాబు కూడా రాలేదు' ఇలాంటి ఎన్నో అబద్దాలను పాదయాత్రలో చెప్పారు జగన్ గారు''. అంటూ కొన్ని ఫోటోలు జత చేసి ట్విట్ చేశారు. ఈ ట్విట్ చుసిన నెటిజన్లు ఘాటుగా స్పందించారు. నిజమే కదా 'బాబు పోయారు 4 లక్షల మందికి గ్రామా వాలంటీర్ జాబు వచ్చింది' అంటూ ట్విట్ చేశారు.     

మరింత సమాచారం తెలుసుకోండి: