ఆంధ్రప్రదేశ్ కు నూతన గవర్నర్ గా ఒరిస్సాకు చెందిన విశ్వ భూషణ్ హరిచందన్  ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.  ఇప్పటివరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ గవర్నర్ గా వ్యవహరిస్తూ వచ్చారు.  ఇక ఇప్పటి నుంచి ఆయన తెలంగాణకు మాత్రమే గవర్నర్ గా కొనసాగనున్నారు . రాష్ట్ర విభజన అనంతరం పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగే అవకాశాలు ఉన్నప్పటికీ, నవ్య ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధానిగా  అమరావతి నిర్మాణం కోసం   మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించిన  విషయం తెలిసిందే. 


నూతన రాజధాని అమరావతి లో అసెంబ్లీ సెక్రెటేరియట్ భవనాల  నిర్మాణం కోసం  కృషి చేసిన  చంద్రబాబు గవర్నర్ నివాసమైన రాజభవన్ నిర్మాణానికి పెద్దగా చొరవ చూపకపోవడంతో ,  ప్రస్తుత గవర్నర్ ఎక్కడ నివాసం ఉంటారన్నది చర్చనీయాంశంగా మారింది ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా కొనసాగిన నర్సింహ్మన్  హైదరాబాదులో ఉన్న రాజ్ భవన్ లో నివాసం ఉంటున్నారు . అమరావతికి  ఆయన ఎప్పుడైనా  వస్తే ఓ స్టార్ హోటల్లో బస చేస్తూ తిరిగి హైదరాబాద్ కు  ప్రయాణం అవుతున్నారు.


 ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ కు  పూర్తిస్థాయి గవర్నర్ ను  నియమించడంతో హరిచందన్ కు నివాస భవనాన్ని  జగన్ సర్కార్ ఎక్కడ కేటాయిస్తుందన్నది  కేటాయిస్తున్నది హాట్ టాపిక్ గా మారింది .  బందర్ రోడ్ లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని  హరి చందన్ కు  నివాస భవనం గా కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది తొలుత ఇరిగేషన్ శాఖకు చెందిన ఈ భవనాన్ని ఆధునీకరించి  చంద్రబాబు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా  వినియోగించారు.  ఆ తర్వాత హైకోర్టు భవనంగా కూడా దీన్ని ఉపయోగించారు . ఇక ప్రస్తుతం రాజ్ భవన్ గా మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: