ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం విశ్వరూపం దాల్చుతుంది.  ఎక్కుడ చూసినా బాంబ్ బ్లాస్ట్స్..వందల మంది అమాయకులు చనిపోతున్నారు.  వేల మంది అనాధలుగా మిగిలిపోతున్నారు.  వారి సిద్దాంతాలు..ఆశయాలు ఏవైనా ఎంతో మంది అమాయకులు మాత్రం దారుణంగా బలి అవుతున్నా రు.   హఫీజ్ సయీద్ ఈ పేరు కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే..ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా చీఫ్‌ ఈయన పై ఎన్నో కేసులు ఉన్నవిషయం తెలిసిందే.


తాజాగా ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా చీఫ్‌ హఫీజ్ సయీద్  అరెస్ట్ చేశారు. ఓ కేసు విచారణలో భాగంగా లాహోర్‌ నుంచి గుజ్రాన్‌వాలా వెళ్తున్న సయీద్‌ను కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్‌ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆయన్ని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు అధికారిక వర్గాల సమాచారం. మరోవైపు హఫీజ్‌ను జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించినట్లు పాక్‌ మీడియా వర్గాలు చెబుతున్నాయి. అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా వెళ్లబోతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.పాకిస్తాన్ తమ ఎయిర్‌స్పేస్‌ను ఓపెన్ చేసిన మరుసటిరోజే ఈ అరెస్ట్ జరిగింది.


 ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఇటీవల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ముంబై దాడులకు హఫీజే కారణమంటూ పాక్ కు భారత్ వందలసార్లు ఆధారాలు చూపిన విషయం తెలిసిందే.2008లో జరిగిన ముంబై దాడుల్లో 164 మంది మృతి చెందారు. కాగా, హఫీజ్ సయీద్‌ మొత్తం 23 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇందులో ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు సేకరించారన్న కేసులు కూడా ఉన్నాయి.


అయితే కోర్టు ముందు పాక్ ప్రభుత్వం సరైన సాక్ష్యాధారాలేవి సమర్పించకపోవడంతో బెయిల్‌పై విడుదలయ్యాడు. మరోవైపు  హఫీజ్ సయీద్‌‌ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడైన హఫీజ్ సయీద్‌‌‌ ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు సమర్పిస్తే 10మిలియన్ డాలర్ల రివార్డు అందిస్తామని గతంలో అమెరికా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: