ఏ మట్టిని నమ్ముకుని బ్రతికాడో  ఆ మట్టిలోనే కలిసిపోయాడు. ఏ పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నాడో ఆ పంట మధ్యనే ఊపిరి వదిలేశాడు. పంటను కాపాడుకోవాలనే ఆతృతలో తన ప్రాణానికి ఏమవుతుందో అని ఆలోచించలేకపోయాడు. ఫలితంగా కన్నీళ్లు మిగిల్చి  కన్నుమూసాడు.

వీరఘట్టం మండలం సంత-నర్శిపురంలో పడాల గోవిందరావు అనే కౌలు రైతు పత్తి పంటకు పురుగులు మందు కొట్టి ఆ అవశేషాలు శ్వాసలో చేరి చనిపోయారు.  గోవిందరావు 4 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తుండేవాడు. ఐదేళ్లుగా పత్తి పంటను పండిస్తుండేవాడు. మూడు రోజులుగా కురుస్తన్న వర్షాలకు పత్తి పంటకు పురుగులు పట్టాయి. ఆ పురుగులు పట్టడంతో మందుకొట్టి  పత్తిపంటను  కాపాడుకోవచ్చనే ఆదేశంతో పురుగులు మందు పిచికారీ చేశాడు.

గాలి వీచే దిశకు ఎదురుగా పిచికారీ చేయడంతో ఆ మందు అవశేషాలు అతని శ్వాసలో కలిసి పొలంలోనే కుప్పకూలిపోయాడు. చుట్టు పక్కల ఉన్న రైతులు అది గమనించి అతడిని  ఆసుత్రికి  తీసుకెళ్లేలోగానే  కన్ను మూశాడు. కౌలు రైతు మృతితో సంత-నర్శిపురంలో విషాద   ఛాయలు అలుముకున్నాయి. మృతుడు గోవింద రావుకి భార్య , ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంభానికి పెద్ద దిక్కుగా ఉన్న అతని మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు వర్ణనతీతం.


మరింత సమాచారం తెలుసుకోండి: