పోడు వ్యవసాయం, అటవీ ఉత్త్పత్తులపై ఆధారపడి జీవనోపాధిని పొందుతున్న ఏజన్సీ ప్రజానీకానికి నాటుసారా తయారీ అధనపు ఆధాయం మార్గంగా మార్చుకుంటున్నారు. అయితే ఈ గుట్టుచాటు వ్యాపారంపై ఎక్సైజ్‌ పోలీసులు ఎప్పుడు దాడిచేస్తారో అని నిత్యం భయంతోనే జీవిస్తుంటారు. ఈ సంగతి అలా ఉంచితే ... నాటుసారాకు అలవాటుపడ్డ గిరిజనులు క్రమంగా దానికి బానిసలుగా మారిపోడంతో వారి ఆర్థిక, సామాజిక ఎదుగుదల అభివృద్ది వారికి చేరువ కావటంలేదు. 

ఈ నేపద్యంలో ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రత్యేకంగా ఏజన్సీ ప్రాంతాలపై దృష్టి సారించింది. మందన మండలంలోని నాటుసారా తయారీ, విక్రయ కేద్రాలపై ఎక్స్చేంజ్ అధికారులు దాడులు నిర్వహించారు.  నాటుసారాతో ఇటీవల మరణాల సంభవించిన నేపధ్యంలో  అధికారులు స్పందించారు. సోంపేట, పలాస పరిధిలో ఉన్న ఎక్స్చేంజ్ శాఖ అధికారులు, సిబ్బంది సంయుక్తంగా నాటుసారా తయారవుతున్న కేంద్రాలపై దాడులు నిర్వహించారు. 

మందస , భైరిసారంగాపురం ప్రాంతాల్లో  నాటుసారా అమ్ముతుండగా కొండల శివ, కాంతమ్మ, సామంతుల సుశీల , కొండల కాంచన, పసుపురెడ్డి లక్ష్మీలను 65 లీటర్ల నాటుసారాతో పుట్టుకుని అరెస్ట్ చేసినట్లు సీఐ అబ్బుల్ కాలీం చెప్పారు. పట్టులోగాం, చాపరాయి ప్రాంతాల్లో 1300 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేసినట్టు ఎక్స్చేంజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్  సీఐ పి.రామచంద్రకుమార్, ఈఎస్టీఎఫ్ సీఐ జి. అప్పలనాయుడు ఎసైలు టి.చంద్రశేఖర్, తదితరులు  పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: