నారా లోకేశ్ కు తెలుగు భాషతో మాచెడ్డ ఇబ్బంది అన్న సంగతి తెలుసు కదా. అందుకే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో లోకేశ్ ను ప్రొజెక్టు చేసే క్రమంలో ఆయనకు తెలుగు నేర్పించేందుకు ఓ ట్రైయినర్ ను కూడా పెట్టారు. అప్పట్లో ఆయన నియమాకంపై మీడియాలో చాలా కథనాలు వచ్చాయి.


ఎందుకంటే.. ఆ తెలుగు నేర్పేందుకు పెట్టిన ట్రెయినర్ ను ట్రెయినర్ గా కాకుండా సర్కారు సొమ్ముతో ప్లానింగ్ బోర్డులో సభ్యత్వం ఇచ్చి అన్ని రకాల ప్రభుత్వ సౌకర్యాలు కల్పించారు. లోకేశ్ కు తెలుగు భాష ఎలా ఉచ్ఛరించాలి.. ఎలా మాట్లాడాలి అనే అంశాలపై ట్రెయినింగ్ ఇవ్వడం ఆయన కర్తవ్యం.


పనిలో పనిగా ఆయన టీడీపీ సోషల్ మీడియా వ్యవహారాలు కూడా చూసేవాడు. ఆయన పేరు పెద్ది రామారావు, అంతకు ముందు ఆయన తెలుగు యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసేవాడు. అయితే కొన్నాళ్లుగా పార్టీలో ఆయన ఉనికి కనిపించడం లేదట.


తెలుగుదేశం ఓటమితో ఖర్చులెందుకని తప్పించారా.. అన్న అనుమానాలు రావచ్చు. కానీ ఆయన పార్టీలో లోకేశ్ కు సన్నిహితుడుగా ఉండటం ఇష్టం లేని కొందరు పొమ్మనలేక పొగపెట్టారని టాక్ వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: