మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లును రద్దుచేయాలని ఆటో కార్మికులు ధర్నా చేశారు.గతంలో లోక్ సభలో ఈ బిల్లును ఆమోధించింది.కానీ రాజ్యసభలో దీనిని తిరస్కరించారు.మళ్ళి ఇప్పుడు 2019 లోక్ సభలో ప్రవేశపెట్టారు.ఇది 1988లో మోటార్ వెహికల్ యాక్ట్ కి అనుసంధానంగా ఉంటుంది.కాకపోతే దీనిలో కొన్ని సవరణలు జత చేసి విదేశీ కంపెనీలకు అనుకూలంగా కనిపిస్తున్నాయి.
సెంట్రల్ గవర్నమెంట్ ఆమోధించిన క్యాబ్ లకు మాత్రమే ఈ బిల్లు వర్తిస్తుంది.ఈ బిల్లులో మోటార్ వాహన ప్రమాధాల విషయంలో పరిహారం మరియు భీమా నిబంధనలను సవరించింది.విజయవాడ ధర్నా చౌక్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ ఆందోళనను జరిగింది.
ఆటో కార్మికులు జీవనోపాధి నాశనం చేసేందుకు విదేశీ కంపెనీలు ఓలా మరియు ఉబర్ లాంటి సంస్థలకు కేంద్రం కొమ్ము కాస్తుందని ఆ బిల్లు దానికి అనుకూలంగా ఉందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తన బిల్లులను వెనక్కి తీసుకోవాలని లేదంటే ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

raj