గత కొంత కాలంగా దాయాది దేశమైన పాకిస్థాన్ తో విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమ గగనతలం పై విధించిన ఆంక్షల్ని ఎత్తివేసినట్లు మంగళవారం వేకువజామున 12.41 గంటల తరువాత.. పాక్‌ గగనతలం భారత విమానాలకు అందుబాటులోకి రానున్నట్లు పాకిస్థాన్‌ పౌర విమానయాన సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది. బాలాకోట్ ఎయిర్‌‌స్ట్రైక్స్ తర్వాత గగన తలాన్ని మూసేస్తున్నట్టు ప్రకటించిన పాకిస్థాన్.. ఎట్టకేలకు 138 రోజుల తర్వాత గగతలాన్ని తిరిగి తెరిచింది. 

 గగన తలాన్ని మూసేయాలని ఫిబ్రవరి 27న పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయంతో.. భారత విమానయాన సంస్థలకు అదనపు ఖర్చు పెరిగింది. పశ్చిమ దేశాల నుంచి ఢిల్లీకి నాలుగు ప్రయాణ సమయం పెరిగింది. దాయాది దేశం నిర్ణయంతో జులై 2 వరకు ఎయిర్‌ ఇండియా దాదాపు రూ.491 కోట్లు నష్టపోయింది. ఢిల్లీ నుంచి ఐరోపా దేశాలకు నడిపే అనేక సర్వీసుల మార్గాలను మార్చాల్సి రావడం వల్ల ఈ నష్టం వాటిల్లింది. స్పైస్‌జెట్‌ రూ.30.73, ఇండిగో రూ.25.1, గోఎయిర్‌ రూ.2.1 కోట్లు నష్టపోయినట్లు ఇటీవల రాజ్యసభకు అందించిన నివేదికలో పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తెలిపారు.

ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఆ దేశం మీదుగా విమాన రాకపోకలు నిషేధించాలని అమెరికా కోరుతోంది. పాకిస్థాన్ గగనతలాన్ని మూసేయడంతో.. యూరప్, అరబ్ దేశాలకు వెళ్లే భారత్ విమానాలు ఇరాన్ మీదుగా వెళ్తున్నాయి. గగన తలాన్ని తెరవాలని అమెరికా ఒత్తిడి చేయడం కూడా పాకిస్థాన్ ఈ నిర్ణయానికి దోహదం చేసి ఉంటుందని భావిస్తున్నారు. 

కాగా, పాక్‌ నిర్ణయంపై స్పందించిన భారత్‌.. ఇరు దేశాల మధ్య అన్ని మార్గాల్లో విమానయాన ఆపరేషన్లు పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దు సమీపాన ఉన్న వైమానిక స్థావరాల నుంచి భారత్‌ మోహరించిన అన్ని విమనాలను వెనక్కి తీసుకునేంత వరకు ఆంక్షల్ని ఎత్తివేసేది లేదని పాక్‌ ఇటీవల ప్రకటించిన కొన్ని రోజులకే తాజా నిర్ణయం వెలువడడం గమనార్హం.

బాలాకోట్ ఎయిర్‌‌స్ట్రైక్స్ తర్వాత గగన తలాన్ని మూసేస్తున్నట్టు ప్రకటించిన పాకిస్థాన్.. ఎట్టకేలకు 138 రోజుల తర్వాత గగతలాన్ని తిరిగి తెరిచింది.