కుల్‌భూషణ్ వ్యవహారంపై అంతర్జాతీయ న్యాయస్థానం బుధవారం నాడు తీర్పును వెలబుచ్చనున్న విషయం తెలిసిందే. కుల్‌భూషణ్ యాదవ్  గూఢచర్యానికి  పాల్పడ్డారని పాక్ ఆరోపిస్తోంది.  కాగా, గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పాక్ కోర్టు కుల్‌భూషణ్ జాదవ్‌కు మరణశిక్షణను విధించింది. ఈ తీర్పును అంతర్జాతీయ కోర్టులో  భారత్ సవాల్ చేసింది.కుల్‌భూషణ్ జాదవ్  కేసు విషయమై భారత్, పాక్ తరపు న్యాయవాదులు అంతర్జాతీయ న్యాయస్థానంలో తమ వాదనలను విన్పించారు.  2016 మార్చి 3వ తేదీన కుల్‌భూషణ్ జాదవ్‌ను పాకిస్తాన్ అధికారులు బలూచిస్తాన్‌లో అరెస్ట్ చేశారు.


పాక్‌లో గూఢచర్యానికి దిగుతున్నాడనే ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. గూఢచర్యం చేశాడని పాక్ మిలటరీ కోర్టు 2017 ఏప్రిల్ లో కుల్‌భూషణ్ జాదవ్‌కు మరణశిక్ష విధించింది.  ఈ విషయం తెలిసిన ఇండియా అంతర్జాతీయ న్యాయ స్థానంలో 2017 మేలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వివాదంపై కొంత కాలంగా ఇరు దేశాల మద్య సంప్రదింపులు నడుస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ కోర్టు కులభూషణ్ జాదవ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పాక్ కోర్టు విధించిన తీర్పును నిలిపివేసింది.


భారత్, పాక్ జడ్జిలు సహా 16 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం.. ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది.  అమాయకుడైన కులభూషణ్ జాదవ్‌‌ను దోషిగా చిత్రీకరించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. దీనికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి 21 వరకూ సాగిన తుది విచారణలో భారత్‌, పాకిస్తాన్‌లు తమ వాదనలను న్యాయస్ధానానికి నివేదించాయి. 


వియన్నా ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తూనే ఉందన్నారు. జాదవ్‌ను గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ చేసిన పాకిస్తాన్.. అందుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఇప్పటివరకూ బయటపెట్టలేదన్నారు. ఇప్పటికే అనేక సార్లు సంప్రదించినా.. జాదవ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వలేదని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: