తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్‌ భేటీ అయింది. ఈ భేటీ సంధర్భంగా  ప్రధానంగా నూతన మున్సిపల్‌ చట్టానికి కేబినెట్ అంగీకారం  తెలపనుంది.అలాగే జెడ్పీ, ఎంపీపీ మొదటి సమావేశం తేదీ సిధ్దమైయ్యాయి. ఆర్డినెన్స్ స్థానంలో బిల్లుకు అమోదం తెలపనుంది.
బోధనాస్పత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్ళకు పెంచిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు సిధ్ధంచేశారు. పురపాలక వార్డుల సంఖ్య ఖరారు, ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు, ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ పాలసీ ముసాయిదా రుణవిమోచన కమిషన్ చైర్మన్ గా వేరేవాళ్ళను నియమించేందుకు ఆర్డినెన్స్ స్థానంలో బిల్లుకు కేబినెట్ అంగీకారం తెలపనుంది.  
శాసనసభ సమావేశాల్లో రెండు రోజులు జరగనున్న ఈ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉందని బుధవారం జరిగిన కేబినెట్‌ భేటీలో తెలంగాణలో ప్రవేశపెట్టే బిల్లు గురించి సీ.ఎం కేసీఆర్ తెలియజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: