ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతపై సంచలన వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్యకు ఒక్కసారిగా టీడీపీ నేతలు అవాక్కయ్యారు టీడీపీ నేతలు. అసంబ్లీ సమావేశాల్లో జరిగేవి అన్ని ప్రత్యక్ష ప్రసారం అవుతుంది కాబట్టి నీటిజన్లు కూడా భారీగా కామెంట్లు చేస్తున్నారు. 


ఆ వ్యాఖ్య ఏంటి అని అనుకుంటున్నారా ? అదేనండి .. ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాల్లో సీట్ల కేటాయింపుపై ఈరోజు ఎలాంటి వాగ్వాదం జరిగింది అనేది అందరికి తెలిసిందే. అచ్చెన్నాయుడు తన సీట్లో కూర్చోకుండా చంద్రబాబు పక్కనే బుచ్ఛయ్య చౌదరికి కేటాయించిన సీటులో కూర్చుంటున్నారని మంత్రి బుగ్గన ఆరోపించారు. 


ఈ విషయంపై జగన్ మాట్లాడుతూ 'కేటాయించిన సీట్లలో కూర్చోవాలని స్పీకర్‌ రూలింగ్‌ ఇచ్చారన్నారు'. దీంతో అచ్చెన్నాయుడు తన సీటులో వెళ్లి కూర్చున్నారు. అయితే చంద్రబాబు నాయుడు వైసీపీ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి కూర్చున్న సీటు గురించి మాట్లాడ్డంతో,  జగన్ మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డి ఫస్ట్ నుంచి అక్కడే కూర్చున్నారని. ఆ సీటుపై 'శ్రీధర్ రెడ్డి'కి కొంచెం 'వ్యామోహం' ఉండవచ్చునని అన్నారు. శ్రీధర్ రెడ్డి ఇవాళ కొత్తగా ఆయన అక్కడ కూర్చోలేదని, అసెంబ్లీ ప్రారంభం అయిన దగ్గర నుంచి, ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అక్కడే కూర్చుంటున్నారని వ్యాఖ్యానించారు. అయితే ఇవన్నీ చూస్తున్న నెటిజన్లు 'ఏపీ అసెంబ్లీలో సీట్ల గొడవ ఏంటి అని కామెంట్లు చేస్తున్నారు'.
 


మరింత సమాచారం తెలుసుకోండి: