అసెంబ్లీ లో జగన్ టిడిపి సభ్యులకు నాన్-స్టాప్ క్లాస్ పీకారు 'తెలుసుకో వయ్య ముందు తెలుసుకో' అని చంద్రబాబును ఉద్దేశించి జగన్ వేసే సెటైర్స్ చాలా పాపులర్ అయ్యాయి. తాజాగా జగన్ అసెంబ్లీ కి సంబంధించి క్లాస్ తీసుకున్నారంట కానీ అది టిడిపి సభ్యుల కాదు.  మంత్రులకు వైసిపి ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సమావేశాలకు హాజరవడం దగ్గర్ నుంచి సభకు ప్రిపేర్ అవ్వడం దాకా. 

 చాలా మంది వైసీపీ ఎమ్మెల్యే లు కొంత మంది మంత్రుల తీరు పై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారట.  ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ కి హాజరు కావాల ని స్పష్టం చేశారంట అలానే మంత్రులూ ఎమ్మెల్యేలూ సబ్జెక్టులపై ప్రిపేరై రావాలనే ఆదేశించారట టిడిపి సభ్యులు అడిగే ప్రతి ప్రశ్నకు మంత్రులు ధీటైన సమాధానం ఇవ్వాలని తేల్చి చెప్పారట.   తమదైన శైలిలో కొంత మంది మంత్రులూ ఎమ్మెల్యేలూ వ్యవహహరిస్తున్నారు కానీ అందరూ అదే స్థాయి లో వివిధ అంశాల మీద పూర్తి అవగాహన తో ఉండాలనీ ప్రతిపక్షానికి ఏమాత్రం చాన్స్ ఇవ్వకుండా ఉండాలనీ జగన్ భావిస్తున్నారట. 

అసెంబ్లీకి వంద కు వంద శాతం హాజరు ఉండాల్సిందేనని  తేల్చిచెప్పారట.  జగన్ ఎమ్మెల్యేల వ్యవహార శైలి మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేశారట సీఎంగా బాధ్యత లు చేపట్టిననాడే తన పాలన  ఎలా ఉండబోతోందో స్పష్టం చేశానని అయినా కొందరు ఎమ్మల్యేలపై ఆరోపణలొస్తున్నాయి అని సీరియస్ అయ్యారట. సక్రమంగ లేని ఎమ్మెల్యే లకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వను అని తేల్చి చెప్పారట.

ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలపై ఇంటెలిజెన్స్ వర్గాలూ సీఎంకి రిపోర్ట్ ఇచ్చారట. వాటిని ప్రస్తావించి మరీ ఎమ్మెల్యే లకు జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. పనితీరు మార్చుకోకపోతే సహించేది లేదని జగన్ క్లాస్ పీకడంతో వైసీపీ ఎమ్మెల్యే లు కూడా అలర్ట్ అయ్యారట. అదే సమయంలో ఎన్నికల్లో ఖర్చుపెట్టిన మొత్తాన్ని రాబట్టుకోకుంటే ఎలా అన్న ఆందోళన కూడా ఎమ్మెల్యేలలో పెరుగుతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: