2016 లో పాక్ మిలిటరీకి చిక్కిన నలభై తొమ్మిది ఏళ్ల కుల్ భూషన్ గూడ చౌర్యానికి ఉగ్రవాదానికి పాల్పడ్డారంటూ పాక్ మిలిటరీ కోర్టు రెండు వేల పదిహెడు ఏప్రిల్ లో మరణ శిక్ష విధించింది దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అదే ఏడాది మే ఎనిమిదిన ఐసీజే ను ఆశ్రయించింది కులభూషణ్ ఇరాన్ లో వ్యాపారం చేసుకుంటుండగా అక్రమంగా నిర్బంధించారని కోర్టుకు భారత్ తెలిపింది.
న్యాయమూర్తి అబ్దుల్ ఖలీల్ అహ్మద్ యూసుఫ్ నేతృత్వంలోని పది మంది సభ్యుల ధర్మాసనం, తాము తుది తీర్పు ఇచ్చే వరకూ మరణ శిక్ష అమలును నిలిపి వేయాలని పాక్ ను ఆదేశించింది.ఈ వ్యవహారంపై గత ఫిబ్రవరి లో విచారణ చేపట్టి ఉభయ దేశాల వాదనలు వింది.రెండు వేల పదహారులో కుల్ భూషణ్ జాదవ్ ను బలూచిస్థాన్ ప్రావిన్స్ లో పాకిస్థాన్ బలగాలు అదుపు లోకి తీసుకున్నాయి. అక్కడి మిలటరీ కోర్టు అతడికి మరణ శిక్ష విధించింది.
అయితే ఈ తీర్పు ను భారత్ అంతర్జాతీయ న్యాయస్థానం లో సవాల్ చేసింది. పాక్ మోపిన కుట్రపూరిత అభయోగాలపై రెండు వేల పదిహెడులో అంతర్జాతీయ న్యాయ స్థానాన్ని భారత్ ఆశ్రయించింది. అంతేకాక మాజీ నేవీ అధికారిపై లేనిపోని ఆరోపణలు చేసిందని వాదనలు వినిపించింది.అంతేకాదు వియన్నా ఒప్పందాన్ని పాకిస్థాన్ తన ఇష్టం వచ్చినట్లు ఉల్లంఘిస్తోందని గుర్తు చేసింది.
బలూచిస్థాన్ లో ఉన్న జాదవ్ ను పాకిస్థాన్ మిలిటరీ అదుపులోకి తీసుకుంది. రెండు వేల పదహారు మార్చి మూడున ఇరాన్ నుంచి వ్యాపార నిమిత్తం వస్తున్న అతడిని అరెస్టు చేసింది. తర్వాత జాదవ్ కిడ్నాప్ కు గురయ్యాడని భారత్ ఫిర్యాదు చేసింది కానీ, ఇరాన్ లో లేకపోవడంతో అనుమానం వచ్చింది. తొలుత నిరాకరించిన తరువాత తమ వద్దే ఉన్నాడని పాకిస్తాన్ అంగీకరించింది.
అంతర్జాతీయ న్యాయస్థానం నేడు  సాయంత్రం ఆరు గంటలకు తీర్పును ప్రకటించి పాక్ ప్రభుత్వానికి చుక్కేదురయ్యేలా చేసింది.ఉరిశిక్షను రద్దు చేస్తూ భారత దౌత్యాదికారులకు అనుమతి ఇవ్వాలని కోర్ట్ ఆదేశించింది.పదకొండు జడ్జిల బేంచ్ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించడంతో కుల్ భూషణ్ బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ తీర్పు పై విదేశాంగా శాఖా మంత్రి సుష్మ స్వరాజ్ అంతర్జాతీయ న్యాయస్థానం పై హర్షం వ్యక్తం చేశారు.అంతేకాక ఐజేసీ తీర్పు పై రాష్ట్రపతి ప్రణబ్ మరియు ప్రధాని మోది హర్షం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: