ఏపీలో కొత్త గ‌వ‌ర్న‌ర్ నియ‌మితుల‌య్యారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన కీల‌క ప‌రిణామం ఇదే! అయితే, పైకి క‌నిపిస్తున్న విధంగా కేంద్రం ఉదారంగా ఏపీలో గ‌వ‌ర్న‌ర్‌ను నియ‌మించ‌లేదు. చాలా వ్యూహ‌త్మ‌కంగా, చాలా నిక్క‌చ్చిగా త‌న వ్యూహాల‌ను అమ‌లు చేసేలా చ‌క్ర‌మం త‌ప్పింది. ఇటీవ‌ల కాలంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏపీలో ఒక్క సీటును కూడా ఓడిసి ప‌ట్ట‌క‌పోయినా.. చ‌క్రం తిప్పుతాం.. అంటూ క‌మ‌ల నాధులు ప‌దే ప‌దే ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న ప‌రిస్థితి మ‌న‌కు క‌నినిస్తోంది. అయితే, ఈ వ్యాక్య‌ల వెనుక మ‌ర్మాన్ని అంత‌గా గుర్తించ‌లేక పోయిన కొంద‌రు రాజ‌కీయ నేత‌లు వీటిని లైట్‌గా తీసుకుని ఉంటారు. 


కానీ, టార్గెట్ 2024 ధ్యేయంగా బీజేపీ చాలా దూకుడుగా ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్‌ను నియ‌మించింది. వాస్త‌వానికి కేంద్రంలోని అధికార పార్టీ ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధిగా గ‌ర‌న్న‌ర్లు ప‌నిచేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఎప్ప‌టినుంచో ఉన్నాయి. కంగ్రెస్ ఇన్నేళ్లూ ఆ ఒర‌వ‌డినే కొన‌సాగిస్తూ వ‌చ్చింది. యూపీఏ హ‌యాంలో రాజ్‌భ‌వ‌న్ల‌కు కాంగ్రెస్ వారినే పంపేవారు. ఆఖ‌రికి రాజ్‌భ‌వ‌న్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక మ‌ళ్లీ క్రియాశీలంగా పార్టీ సేవ చేస్తున్న సుశీల్ కుమార్ షిండే లాంటి వారూ ఉన్నారు. 


పార్టీ సేవ చేసినా పాత‌త‌రం నేత‌ల‌కు పున‌రావాస శిబిరాలుగా రాజ్‌భ‌వ‌న్లు మారాయ‌ని గ‌తంలో విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. ప్ర‌స్తుతం రాష్ట్రాల‌కు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు నియ‌మించిన గ‌వ‌ర్న‌ర్లు,  లెఫ్టినెంట్ అత్య‌ధికులు ఆరెస్సెస్‌, బీజేపీ నేప‌థ్య‌మున్న‌వారే! సంఘాలోనూ, పార్టీలోనూ చేర‌కున్నా బీజేపీ స‌ర్కారుపై అనుకూల‌త ప్రద‌ర్నిస్తున్నవారే! మొత్తం 35 మందికి గానూ 30 మంది వారే ఉన్నారు. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌ల‌కు నియ‌మితులైన ఇద్ద‌రు కూడా గ‌తంలో బీజేపీ నేత‌లే. గుజ‌రాత్ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితులైన దేవ‌వ్ర‌త్ ఆర్య‌స‌మాజ్ ప్ర‌చార‌క్‌గా ఉండేవారు. బాబా రాందేవ్‌కు అనుకూలురు. 


వీరంతా బీజేపీ క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేయాలేర‌ని చెప్ప‌డానికి సాహ‌సించే ధైర్యం ఏ ఒక్క‌రికీ ఉండ‌దు.  అంటే.. వ‌చ్చే ఐదేళ్ల కాలంలో ఏపీలో బీజేపీని బ‌లోపేతం చేయ‌డంతోపాటు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏకంగా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించ‌డంలో భాగంగానే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్య‌క్తుల‌కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డం జ‌రిగింద‌నే వ్యాఖ్యాలు జోరుగా వినిపిస్తున్నాయి. మ‌రి రాబోయే ఐదేళ్ల కాలంలో ఏపీలో బీజేపీ ఎలా విజృంభిస్తుందో చూడాలి. దీనికి గ‌వ‌ర్న‌ర్ ఏమేర‌కు స‌హ‌కారం ఇస్తారో తెలియాలంటే.. కొన్నాళ్లు వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: