టిడిపికి అనుకూలంగా ఓట్లేసినందుకు వారి ఓట్లను తొలగించేందు కు రంగం సిద్ధం చేసిన వ్యవహారం పశ్చిమగోదావరి జిల్లా కోరుకొల్లు గ్రామం లో కలకలం రేపుతోంది. ఉండీలో వైకాపా ఓటమికి  కారణమయ్యారంటూ ఏకంగా ఏడు వందల మంది టిడిపి సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు వైసీపీ నేతృలు ప్రయత్నం చేస్తున్నారు. 
పశ్చిమ గోదావరి లో పాలకోడేరు మండలం కోరుకొల్లు గ్రామం ఆవిర్భావం నుంచే గ్రామం టీడీపీకే మద్దతు గా ఉంది మొన్న ఎన్నికల్లో ఈ గ్రామంలో టీడీపీకే మెజార్టీ ఓట్లు వచ్చాయి. ఏడు వందల ఓట్ల మెజార్టీ రావడంతో వైసీపీ వర్గాలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయాయి. కోరుకొల్లు టిడిపి నేతలే ఉండీలో తమ పార్టీ ఓటమికి కారణమని వైసీపీ నాయకులు భావించారు. టిడిపి మద్దతుదార్ల ఓట్లను తొలగించాలని  అధికారులను కొందరు వైసీపీ నేతలు దరఖాస్తు చేశారు.
  టిడిపి మద్దతుదారుల్లో చాలా మంది గ్రామంలో ఉండటం లేదని వారి ఓట్లను తొలగించాలనీ కోరుతూ వారు  రెవెన్యు అధికారులకు ఫారం-7 లను అందజెశారు.  దాదాపు గా ఏడు వందల మంది  ఓట్లకు సంబంధించిన ఓట్ల తొలగింపునకు సంభందించి మనల్నించి ఫారం-7  లను రెవెన్యు అధికారులకు అందచేశారు. ఎవరు సంతకాలు చేశారో కాని అధికారులు మాత్రం ఆగమేఘాల మీద ఆ ఫారాలను పరిగణనలోకి తీసుకొని సంబంధిత ఓటర్లు అందరికీ నోటీసులు జారీ చేశారు.
మీరు గ్రామాల్లో ఉండటం లేదని అందువలన మీ ఓట్లను ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ నోటీసు లు ఇచ్చారు. దీంతో టిడిపి మద్దతుదారులు లబోదిబోమంటూ పాలకోడేరు తహసీల్దార్ కార్యాలయాని కి పరుగులు తీశారు తామంతా గ్రామంలోనే ఉంటున్నామని ఎక్కడికెళ్లినా తిరిగి స్వగ్రామానికి వస్తున్నామని  ఎందుకు తమ ఓట్లు తొలగించార రానుకున్నా చెప్పాలని అధికారుల ప్రశ్నించారు.  ఆధార్ ను చూపిస్తే ఓట్లను తొలగించబోమని అధికారులు చివరికి స్పస్టం చేశారు.   ఫారాలు ఎవరు ఇచ్చారో చెప్పాలని మరియు ఓట్లను  తొలగిస్తే  ఆందోలన తప్పదని గ్రామస్తులు వార్నింగ్ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: