వీధిలైట్ల నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత ఏజన్సీకి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఇచ్చాపురం పురపాలకసంఘం ప్రత్యేక  అధికారి ఆర్డీవో పి.భాస్కరరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజారోగ్యం..పారిశుద్ధ్యం , మంచినీటి సరఫరా.. వీధి దీపాల నిర్వాహణ..  ప్రజల కనీస అవసరాలన్నారు. వీటిని  నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పురపాలక సిబ్బంది పనితీరులో మార్పు కనిపించాలని, పరిపాలనలో బాధ్యత చూపాలన్నారు. 
 వీధిదీపాలు వెలగడం లేదని ప్రశ్నించగా, ఆ ఏజెన్సీ కి అధికారులకు తెలిపినా , స్పందించడం లేదని కమిషనరు రామలక్ష్మి ప్రశ్నించారు. ఆ ఫర్యాదుకు పరిష్కారినికి వెంటనే ఏజెన్సీ  షోకాజ్ నోటీసులు జారీ చేయాలనీ , ప్రత్యామ్నాయ విధానంలో వీధి దీపాలు నిర్వాహణ చేపట్టాలని ప్రత్యేక అధికారి ఆదేశించారు.  కుక్కలు,కోతుల  సమస్య తీవ్రంగా ఉందని పత్రికల్లో వచ్చినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఇచ్చాపురం మండల వాసులు వాపోతున్నారు. వీరి ఫిర్యాదు  మేరకు కుక్కలు, కోతుల నివారణకు ప్రత్యేక చర్యలు  చేపట్టాడానికి ప్రతిపాధనలు సిద్ధం చేయాలని  పి.భాస్కరరెడ్డి అధికారులకు ఆదేశించారు.
1,2,3వార్డులకు మంచినీటి ఎద్దడిపై ఏఈ  ప్రశ్నించారు. గతంలో వేసిన గొట్టాలు నాసిరకమైనవి కావడంతో అవి పగిలిపోయాయని , అయితే అలా అవి ఊరుకోకుండా , సురక్షితమైన  మంచినీటి ని ఆ మూడు వార్డుల ప్రజలకు అందించేలా కృషిచేయాలని ఎం ఎస్ ఓ సూచించారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి, పరిష్కార చర్యలతో పాటు అన్ని వివరాలను తనకు పంపాలని సూచించారు. పట్టణంలో గృహనిర్మాణ పథకం అమలు తీరును టీపీఎస్ ఫణికుమార్ ద్వారా తెలుసుకుని , ఉగాది పర్వదినం నాటికి లక్ష మందికి ఇంటినివేశనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని, ఈలోగా అర్హుల జాబితాలను రూపొందించాలని ఎం ఎస్ ఓ  సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: