ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని పథకాలను ప్రజలకు చేర్చేందుకు గ్రామ వాలంటీర్ల నియామకం చేపడుతున్నారు. జులై 5 వ తేదీతో గ్రామ వాలంటీర్లకు ధరఖాస్తు గడువు ముగియగా జులై 10 వ తేదీతో వార్డ్ వాలంటీర్లకు ధరఖాస్తు గడువు ముగిసింది. జులై 11 నుండి 25 దాకా గ్రామ/వార్డ్ వాలంటీర్లకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. కానీ ప్రకాశం జిల్లాలో గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూలలో అవినీతి జరుగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. 
 
ప్రకాశం జిల్లాలో ఎవరికైతే ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఉంటాయో వారికే గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు లభిస్తున్నాయట. ఈ సిఫార్సు లేఖల కోసం గ్రామ వాలంటీర్లకు ధరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎమ్మెల్యేల దగ్గర క్యూ కడుతున్నారట. ఈ లేఖలు ఇవ్వటానికి కొన్నిచోట్ల 5 నుండి 20 వేల రుపాయల దాకా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందువలన అర్హతలున్న వారికి ఉద్యోగాలు రావటం లేదని సమాచారం. 
 
ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిగారు గ్రామ వాలంటీర్ల ఎంపిక పారదర్శకంగా ఉండాలని ఇందులో అవినీతికి చోటు ఉండకూడదని చెప్పారు. కానీ ఎమ్మెల్యేల క్రింద ఉండే చిన్న చిన్న నాయకులు, గ్రామ స్థాయి నాయకులు ముందుగానే ఎంపిక చేయాల్సిన అభ్యర్థుల జాబితా అధికారులకు ఇస్తున్నారట. కానీ ఇంటర్వ్యూలు చేస్తున్న అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదనీ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలిస్తున్నామని అంటున్నారు. కానీ నిరుద్యోగులు మాత్రం ఈ ఇంటర్వ్యూలపై ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణకు ఆదేశించాలని కోరుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: