ముందుగా 'అమ్మఒడి' అనే పధకాన్ని డాక్టర్ వై యస్ రాజశేఖర్ రెడ్డి గారు వెలుగులోకి తీసుకొచ్చారు.అప్పట్లో ఆ పధకం పదవ తరగతి వరకే అమలులో ఉండేది.తండ్రి బాటలోనే తనయుడు నడుస్తూ ఆ పధకాన్ని మరింత మెరుగ్గు పరుస్తూ,ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి  'అమ్మవొడి' అనే పథకాన్ని పదో తరగతి వాళ్లకే కాకుండా, ఇప్పుడు ఇంటర్ విద్యార్ధులకు కూడా వర్తించేలా పథకం అమలు చేశారు. 
ఈ పథకంతో ఇంటర్ విద్యార్థులలో ఆనందం వెల్లువెత్తుతోంది. ఈ పధకం గురించి విద్యార్ధులు మాట్లాడుతూ, ఈ పథకం ఇంటర్ వరకూ పెట్టడం చాలా ఆనందంగా ఉందని, ఈ పథకం వల్ల చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలని పదో తరగతి వరకే కాకుండా ఇంటర్ వరకు కూడా చదివించుకోవడానికి సహాయంగా ఉంటుందని  హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పథకాన్ని ఇంటర్ వరకు అమలు చేసినందుకు విధ్యార్ధులే కాకుండా, తల్లిదండ్రులు కూడా  ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకున్నారు.ఇటువంటి పథకాలు ఇంక ఎన్నో ఆయన అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: