స్వార్ధం కోసం పరుగులు తీసే ప్రపంచం ఎవరి కోసం ఆగదు,

కానీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆపారు.

అదెలాగో మీరే చదవండి. విశాఖలో గాజువాకకు చెందిన దంపతుల 8 నెలల బిడ్డ పేగు వ్యాధితో బాధపడుతోంది. పేగు నుంచి రక్తస్రావం జరుగుతుండటంతో ఆ పాప తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా వెంటనే, ఆపరేషన్‌ చేయాల్సి ఉందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా ఆ చికిత్స అందుబాటులో లేదని.. ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని, ఆపరేషన్‌ కు రూ.5లక్షలకు పైగా, ఖర్చవుతుందని వైద్యులు వారికి చెప్పారు.

పేదరికం వల్ల ఏమీ పాలుపోక, ఆ దంపతులు సీఎం సహాయనిధి కోసం, అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని ఆ కుటుంబ పరిస్థితిని ఒక టీవీ ఛానల్‌ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో సీఎం జగన్‌ స్పందించారు. పాప పరిస్థితిపై ఆరా తీసి వెంటనే చిన్నారి ఆపరేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని,   పాప ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, అత్యవసర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు తల్లిదండ్రులతో మాట్లాడి చిన్నారిని విజయవాడ, ఆస్పత్రికి తరలించి, ఉన్నతస్థాయి వైద్యులు చిన్నారికి పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఆ బిడ్డకు మెరుగైన వైద్యం అందించాలని, ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.

సత్వరమే స్పందించి మెరుగైన వైద్యం చేయిస్తున్న జగన్‌కి చిన్నారి తల్లిదండ్రులు ధన్యవాదాలు చెబుతున్నారు. మరోసారి జగన్‌ మానవతను చాటారు. ఇంతకు, ఆ వార్తను బ్రేకింగ్‌ న్యూస్‌లో ప్రసారం చేసింది ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌.

ఆ ఛానల్‌ నిబద్దతకు, జగన్‌ మానవతకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: