సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా అధికార పార్టీ ఎన్ని మంచి పథకాలు అమలు చేసినా, ఎంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినా మిగతా పార్టీలు ఎప్పుడూ పథకాలపై, బడ్జెట్ పై విమర్శలు చేస్తూనే ఉంటాయి. ఒకవేళ కొన్ని పథకాలు అందరికీ లబ్ధి చేకూరేలా ఉన్నా బహిరంగంగా అధికార పార్టీని ఎప్పుడూ మెచ్చుకోవు మిగతా పార్టీలు. కానీ వీటన్నింటికీ భిన్నంగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జగన్మోహన్ రెడ్డిగారి పాలనను, బడ్జెట్ ను అసెంబ్లీ సమావేశాల్లో మెచ్చుకున్నారు.

 

రాష్ట్ర బడ్జెట్ రైతులకు ఎంతో మేలు చేసే విధంగా ఉందని, మత్స్యకారులు జగన్మోహన్ రెడ్డిగారిని కోరకుండానే కోరికలు తీర్చే దేవుడని ప్రశంసిస్తున్నారని, దివంగత నేత వై యస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108, 104 ఆంబులెన్స్ ల వలన ప్రజలకు ఎంతో మేలు జరిగిందని రాపాక వరప్రసాద్ అన్నారు. గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థపై దృష్టి పెట్టాలని జగన్మోహన్ రెడ్డిగారికి సూచించారు జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు.

 

జనసేన పార్టీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిగారిపై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే రాపాక వరప్రసాద్ వైసీపీలో చేరతాడేమో అనేలా ఉన్నాయి. జనసేన పార్టీలో గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఈ ఒక్క ఎమ్మెల్యే పార్టీ మారితే జనసేన పార్టీకి కష్టమే. కానీ గతంలో రాపాక వరప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైసీపీలో చేరితే తన నంబర్ 152 అవుతుంది కానీ జనసేనలో నంబర్ 1గా ఉంటుందని తాను నంబర్ 1గానే ఉండాలనుకుంటున్నానని అన్నారు. మరి జనసేన ఎమ్మెల్యే జనసేనలోనే కొనసాగుతాడో లేక వైసీపీలో చేరతాడో తెలియాలంటే కొద్దికాలం ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: