పాకిస్థాన్ ఇప్పుడే ఎందుకు నిద్ర లేచింది. భరత్ పట్ల అనుసరిస్తున్న వైఖరికి సడన్ గా మార్పు దేనికి సంకేతం. ఇమ్రాన్ సర్కార్ ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయా లను ఎలా చూడాలి. ఇటు భారత్ దాయాది పాకిస్థాన్ వ్యవహార శైలి కొంత కాలంగా మారుతూ వస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ పరిణామాలు చర్చకు దారి తీస్తున్నాయి.
ప్రధానంగా భారత్ దేశం పట్ల అనుసరిస్తున్న తీరు ఆరోచన లో పడేస్తోంది పలు సంధర్బాలలో తీసుకున్న నిర్ణయాల ఆహ్వానించదగినవి గా ఉంటున్నాయి.  ఆవేశంలో విధిస్తున్న ఆంక్షలు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. కయ్యానికి కాలుదువ్వే గత చరిత్రకు భిన్నంగా తాజా సంధర్బాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి.
మొన్నటి కి మొన్న పాకిస్థాన్ సైన్యానికి చిక్కిన భారత వాయు సేన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ను క్షేమంగా భరత్ కు అప్పగించిన పైక్ సైన్యం అంతర్జాతీయం గా పాకిస్థాన్ పై నెలకొన్న ప్రతికూల భావనలు తగ్గించేందుకు ప్రయత్నించింది. జనివో ఒప్పందాన్ని పాటించి తమ సైన్యాన్ని చిక్కిన ఎనభై గంటల్లోనే అభినందన్ ను అధికారికంగా భారత్ కు అప్పగించింది. ఇప్పుడు ఇరవై నాలుగు గంటల వ్యవధి లోనే రెండు కీలక నిర్ణయా లు తీసుకుంది.

పాకిస్తాన్ బాలాకోట్ లో భారత వైమానిక దాడుల తర్వాత తమ గగనతలాన్ని మూసేసిన పాకిస్థాన్ అనూహ్యంగా తమ ఏర్-స్పేస్ ను తెరుస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఈ రోజే అంతర్జాతీయ ఉగ్రవాది ముంబై మారణ హోమం సూత్రధారి హఫీజ్ సయీద్ ను అరెస్ట్ చేసింది. ఈ రెండు పరిణామాల్లో పాకిస్థాన్ వైఖరిపై అంతర్జాతీయంగా చర్చలు లేవనెత్తాయి.

రెండు వేల ఎనిమిది ముంబై మారణ హోమం ప్రధాన సూత్రధారి అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ ను పాకిస్థాన్ లోని పంజాబ్ లో ఉగ్రవాద వ్యతిరేక విభాగ అధికారులు అరెస్ట్ చేశారు. వెంటనే జుడీషియల్ కస్టడీకి తరలించారు లాహార్ నుంచి గుజ్రన్ వాలా కు వెళ్తుండగా మార్గం మధ్యలో అధికారులూ హఫీజ్ ను తమ అదుపు లోకి తీసుకున్నారని జమాత్-ఉద్-దవా సంస్థ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించిన్నట్టు ఆ దేశ మీడియా పేర్కొంది.

ఉగ్రవాద కార్యక్రమాల కోసం నిధులు సేకరించాడన్న  అభియోగంతో  హఫీజ్ ను పాకిస్తాన్ పోలీసు లు అరెస్ట్ చేశారు.  ఈ పరినామాల వెనకనున్న నిఘూడమేమిటో.


మరింత సమాచారం తెలుసుకోండి: