తెలుగుదేశం పార్టీని అధికారంలో  నుంచి దించేసిన కాపులు ఇపుడు ఆ పార్టీని కూడా తిన్నగా ఉండనిచ్చేట్టు కనిపించడంలేదు. టీడీపీ అంటే ఒక సామాజికవర్గానికి చెందిన పార్టీగా ముద్ర పడిపోయిందని కాపులు ఫైర్ అవుతున్నారు. టీడీపీ అధినాయకత్వంలో పార్టీ ఓడినా మార్పు రాలేదని కాపులు గరం గరం అవుతున్నారని టాక్.


ఈ నేపధ్యంలో టిడిపి కాపు నేతలు కొందరు తూర్పు గోదావరి జిల్లా కాకినాడులో మళ్లీ సమావేశం అయినట్లు సమాచారం వచ్చింది. అందులో పాల్గొన్న నేతలు కొందరు టీడీపీకి అనుకూలంగా ఉండే ఓ పత్రికాధిపతిపై ఆరోపణలు చేశారని భోగట్టా. ఆయన చెప్పినవారికే టిడిపి సీట్లు , కోట్ల డబ్బు ఇచ్చారని వారు అబిప్రాయపడ్డారట. ఇక  లోకేశ్‌ తన సొంత సామాజిక వర్గానికే పార్టీలో పెద్దపీట వేస్తున్నారని నేతలు విమర్శించారు.


చంద్రబాబు, లోకేశ్‌లు కాపులను అవమానంగా చూసేవారని కాపులు ఇపుడు ఆరోపిస్తున్నారు. సూటు బూటు వేసుకున్న వారికే లోకేశ్‌ ఎక్కువ సమయం కేటాయించే వారని కూడా వారు అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం నేతల కంటే కమ్మ సామాజిక వర్గం వారికే పార్టీ ఫండ్‌ ఎక్కువగా ఇచ్చారని వారు ఆరోపించారని అంటున్నారు. మొత్తానికి  టిడిపిలో కాపు వివాదం ముదురుతోందని అనుకోవాలి. మరి బాబు ఏ విధంగా పరిక్షరిస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: