తెలుగుదేశం పార్టీ బాబు నాయకత్వంలోకి వచ్చాక తెర వెనక పొత్తులు, ఒప్పందాలు ఎపుడో మొదలయ్యాయి. బయట యుద్ధం, లోపల స్నేహం ఇలా సాగించిన చరిత్ర కూడా టీడీపీకి ఉంది. ఇదిలా ఉంటే టీడీపీ నుంచి వెళ్తున్న బిగ్ షాట్స్ చాలా  లౌక్యంగా ప్రవరిస్తున్నారు. వారి విషయంలో టీడీపీ హై కమాండ్ కూడా గమ్మునుంటోంది.


బీజేపీలోకి ఫిరాయించాక మొదటిసారిగా విజయవాడ వచ్చిన సుజనా చౌదరి అన్న గారి బొమ్మ తో ఉన్న ఫ్లెక్సీలతో స్వాగతం పలికించుకున్నారు. ఆయన చంద్రబాబు జైలుకు ఎందుకు వెళ్తారని అమాయకంగా ప్రశ్నిస్తారు. టీడీపీ పాలన, బాబు పాలన భేష్ అంటారు. పార్టీ ఓడిపోవడానికి నాయకుల అవినీతి కారణం అంటారు. ఇక చంద్రబాబు సైతం సుజనా విషయంలో పల్లెత్తు మాట అనరు.


ధర్మ పోరాట దీక్షలు కావు అధర్మ పోరాట దీక్షలంటూ మొహమాటంగా సుజనా చేసిన ఓ కామెంటుని సైతం ఖండించేందుకు తమ్ముళ్లకు మరింత మొహమాటం అడ్డువస్తోందంటే ఈ కధ ఎంత బాగా సాగుతోందో కదా. మరి ఈ డౌట్ వైసీపీ సీనియర్ నేత రామచంద్రయ్యకు వచ్చింది. సుజనా అలా తిట్టేసి పోతే ఇప్పటివరకూ ఎందుకు ఖండించరంటూ బాగానే లాజిక్ పాయింట్ తీశారు. మరి దీనికి బాబు అండ్ కో వద్ద సమాధానం ఉందా.


మరింత సమాచారం తెలుసుకోండి: