ఇసుక వాటాల పంపకాల్లో వచ్చిన తేడాల కారణంగానే ఇద్దరు వైకాపా ప్రజాప్రతినిధుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయా? అంటే  అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. బాపట్ల ఎంపీ సురేష్ , తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మధ్య ఇసుక వాటాల పంపకాల్లో తేడాలు వచ్చాయని అందుకే ఒకరంటే మరొకరికి గిట్టడం లేదన్న ప్రచారం జోరందుకుంది . ఇటీవల ప్లెక్సీ వివాదం లో సురేష్ , శ్రీదేవి అనుచరులు ఒకరిపై మరొకరు చేయి చేసుకున్న దాక వెళ్లడమే కాకుండా , పోలీసు స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు .


 ఇదే అంశమై  సురేష్ తన నియోజకవర్గం లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి శ్రీదేవి  ఫిర్యాదు చేసుకున్నట్లు తెలుస్తోంది . అయితే వీరిద్దరి మధ్య విబేధాలకు ప్రధాన కారణం ఇసుక వాటాల పంపకాల్లో తేడాలేనన్న వాదనలు బలంగా విన్పిస్తున్నాయి .  వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ,  ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే .  తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ రవాణా ద్వారా ఆ పార్టీ నాయకులు  కోట్లు దండుకున్నారని  వైకాపా నాయకులు ఆరోపించారు .


 ఇప్పుడు తమ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఇసుక వాటాల పంపకాల్లో వచ్చిన తేడాల కారణంగా బజారుకెక్కడం వైకాపా నాయకత్వాన్ని విస్మయానికి గురి చేస్తోంది . వైకాపా అధికారంలోకి వచ్చి యాభై రోజులు కూడా గడవకముందే పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య, ఇసుక వాటాల వ్యవహారం  భేదాభిప్రాయాలు తలెత్తడం   కాకుండా , తన వద్దకే పంచాయితీ కి రావడం జగన్మోహన్ రెడ్డి ని షాక్ కు గిరి చేసినట్లు తెలుస్తోంది . మరి వీరిద్దర్నీ ఆయన ఎలా కంట్రోల్ చేస్తారన్నది హాట్ టాఫిక్ గా మారింది .


మరింత సమాచారం తెలుసుకోండి: