తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడానికి ప్రధాన కారణం పేరులోనే దీపం ఉన్న పత్రిక అధిపతి అంటూ తెలుగుదేశానికి చెందిన కాపు నేతలు విమర్శించినట్టు తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన కాపు నేతలు కొందరు కాకినాడులో మరోసారి సమావేశం అయ్యారట. ఆ సందర్భంగా వారు ఆ పత్రికాధిపతి తీరుపై మండిపడ్డారట.


సదరు పత్రిక యజమాని చెప్పినవారికే చంద్రబాబు సీట్లు, కోట్ల డబ్బు ఇచ్చారని కాపు నేతలు ఆరోపిస్తున్నారట. లోకేశ్‌ తన సొంత సామాజిక వర్గానికే పార్టీలో పెద్దపీట వేస్తున్నారని ఆ నేతలు మండిపడుతున్నారట. చంద్రబాబు, లోకేశ్‌ కాపులను అవమానంగా చూసేవారని వారు చెబుతున్నారు.


సూటు బూటు వేసుకున్న వారికే లోకేశ్‌ ఎక్కువ సమయం కేటాయించే వారని కూడా కాపు నేతలు గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు.. మొన్నటి ఎన్నికల సమయంలోనూ టీడీపీ కాపు, కమ్మ నేతల మధ్య పక్షపాతం చూపిందని వారు అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం నేతల కంటే కమ్మ సామాజిక వర్గం వారికే పార్టీ ఫండ్‌ ఎక్కువగా ఇచ్చారని వారు అంటున్నారట.


ఇప్పటికే టీడీపీలోని కాపు నేతలు కొన్నిరోజుల క్రితం కాకినాడలో సమావేశం అయ్యారు. తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అప్పట్లో వారంతా మూకుమ్మడిగా బీజేపీలో చేరిపోతున్నారని మీడియా కోడై కూసింది. ఈ నేపథ్యంలో వారు ఇలా సమావేశం కావడం.. ఇలాంటి ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: