వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాజధాని అమరావతి అభివృద్ధి ఆగిపోయిందని టీడీపీ విమర్శిస్తోంది. అమరావతిలో నిర్మాణ పనులన్నీ ఆగిపోయాయని.. భూముల రేట్లు ఘోరంగా పడిపోయాయని మీడీయాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంల రాజధాని అమరావతిపై ఆర్థిక మంత్రి ఆసక్తికరమైన ప్రసంగం చేశారు.


రాజధాని నిర్మాణం కొరకు పలు దేశాలు తిరిగి వచ్చిన చంద్రబాబు చివరకు సినీ దర్శకుడు రాజమౌళికి అప్పగించారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. రాజధాని నిర్మాణం కొరకు గత ఐదేళ్లలో రూ. 1700 ​కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. అందులోనూ సగానికి పైగా నిధులు కేంద్రమే ఇచ్చిందని వివరించారు.


ఐదేళ్లలో తెదేపా ప్రభుత్వం కేవలం రూ. 277 కోట్లు మాత్రమే కేటాయించిందని మంత్రి బుగ్గన వెల్లడించారు. రాజధాని నిర్మాణం కొరకు తొలి బడ్జెట్‌లోనే రూ. 500 కోట్లు కేటాయించామని... టీడీపీ ప్రభుత్వం నిర్మించిన భవనాల్లో సరైన వసతులు కూడా లేవని తెలిపారు. చిన్న చినుకు పడినా భవనాల్లోకి వర్షం నీరు వస్తోందని విమర్శించారు.


కేవలం ఐదుశాతమే వడ్డీలేని రుణాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి బుగ్గన అన్నారు. వడ్డీలేని రుణాలకు కేటాయింపులు వచ్చే బడ్జెట్‌లో భారీ ఎత్తున ఉంటాయని బుగ్గన వెల్లడించారు. ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేశామని... తొలి బడ్జెట్‌లోనే మేనిఫెస్టోలో ఇచ్చిన 80 శాతం హామీలకు కేటాయింపులు చేశామని మంత్రి బుగ్గన వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: