అర్ధాంతరంగా రాష్ట్రం విడిపోవడం తో, అనుభవజ్ఞుడు అవ్వడంతో ప్రజలు చంద్రబాబు నాయుడు ని గెలిపించారు అయితే 5సంవత్సరాల పరిపాలనలో ఆయన రాష్ట్రానికి చేసింది ఏమి లేదని ప్రజలు ఈసారి యువకుడు,తండ్రికి తగ్గ తనయుడు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని గెలిపించి అధికారం కట్టబెట్టారు.

పరిపాలన ప్రారంభించిన మొదటి రోజు నుండి ప్రజల బాగోగులు లక్ష్యం గా సీఎం గారు పని చేస్తున్నారు అని వైస్సార్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎతెస్తున్నారు.అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వాలు చేసిన తప్పులని ఒక్కొక్కటి గా బయటికి లాగుతున్నారని ప్రభుత్వంపై లేని పోనీ నిందలు చేస్తున్నారు ప్రతిపక్షం నాయకులు ఇది కేవలం ప్రజలను తప్పు దారి పట్టించాడమే అని వైసీపీ నాయకులు ఆవేదన పడ్డారు.

వైఎస్ జగన్ కేవలం సుపరిపాలన చేస్తే సరిపోదని, ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిలా పరిపాలన చేయాలని, తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకోవాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. జగన్ కు ఇది సవాల్ అని దీన్ని జగన్ సాధిస్తాడాని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: