ఈ రోజుల్లో మంచి జరిగిన చెడు జరిగిన ప్రజల్లోకి తొందరగా వెళ్లి పోతుంది అందుకు కారణం ఒకటి టెలి మీడియా,రెండు సోషల్ మీడియా. సోషల్ మీడియా లో ప్రసారం అయ్యే వార్తలు నిజమా కాదా అనే సందేహం మనకు వస్తుంది కానీ టెలి మీడియా లో ఓ వార్త వచ్చిందంటే అది నిజమే అని నమ్ముతాం,అంతలా టెలి మీడియా మనల్ని ప్రభావితం చేస్తుంది.

కానీ మీడియాని,పత్రికలని అడ్డం పెట్టుకొని కొంత మంది పెద్ద మనుషులు ఎన్నో అక్రమాలు చేస్తున్నారు. మొన్న టీవీ9 రవిప్రకాష్ దొంగ సంతకాల కేసుల్లో ఇరుక్కున్నాడు. అలాగే ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకుడు,ఎండీ అయిన రాధ కృష్ణ అక్రమాల చిట్టా కూడా పెద్దదే అని చాలా మంది ఆరోపిస్తున్నారు.
 
ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేకు జగ్గయ్యపేట కోర్టు అరెస్టు వారెంటు జారీచేసింది. రెండేళ్ల క్రితం జగ్గయ్య పేటకు చెందిన సైదేశ్వర రావు తన భూమికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో తప్పుడు కథనం ప్రచురితమైనట్టు ఆర్కే పై పరువునష్టం దావా వేశాడు. ఈ కేసు విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు పంపిన ఆర్కే కోర్టుకు హాజరు కాలేదు. దీంతో సీరియస్ అయిన కోర్టు ఆర్కే కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది


మరింత సమాచారం తెలుసుకోండి: