ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అయితే  రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి.ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గారు తమ మంత్రి వర్గంతో భేటి అయ్యారు. గడిచిన లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మీద,ప్రభుత్వం మీద ప్రజలకు అసంతృప్తి ఏర్పడింది. అందుకని పార్టీ కార్యకర్తలకు,నాయకులకు సీఎం కేసీఆర్ గారు సలహాలు ఇచ్చారు.

ప్రభుత్వ యంత్రాంగం పని తీరును మెరుగు పరచాలని,నాయకులు ప్రజల సమస్యలపై పరిష్కారాలు తీసుకురావాలని ఆయన సూచించారు. రేపు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ గారు మంత్రిమండలితో చర్చలు జరిపారు.

కొత్త మున్సిపల్ బిల్లుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ప్రగతి భవన్ లో జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ఈ బిల్లుపై సుదీర్ఘంగా చర్చించి ఆమోద ముద్ర వేశారు.ఈ బిల్లును ప్రభుత్వం రేపు అసెంబ్లీ లో ప్రవేశ పెట్టనుంది.అటు వృద్దాప్య పెన్షన్ వయోపరిమితి 57 ఏండ్లకు తగ్గించాలని,బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ డేటాను తొలగించాలని మంత్రివర్గం నిర్ణయించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: