40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు గత అయిదు యెళ్ళలో రాష్ట్రానికి చేసిన మేలు కంటే తన సామాజిక వర్గం మరియు తమ పార్టీ వారికి మేలు ఎక్కువని ఆరోపణలు చేసిన జగన్ అండ్ కో ప్రస్తుతానికి తమ పార్టీ కార్యకర్తలకు అండగా నిలవకపోయిన తమ సామాజిక వర్గానికి అండగా నిలుస్తునరని ప్రతి పక్షం అరోపించెలే ఒక చర్య చేశారు.అది ఇప్పుడు చర్చనీయా అంశం అవుతుంది.

37 సబ్ డివిజన్లకు డీ.ఎస్.పి స్థాయిలో జరిగిన బదిలీల్లో 14 ప్రధాన సబ్ డివిజన్లకు రెడ్డి సామాజిక వర్గం ఆఫీసర్స్ నియామకం అయ్యారు.గత అయిదేళ్లలో కమ్మ సామాజిక వర్గం వారికి న్యాయం జరిగింది.ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం వారికి న్యాయం జరుగుతుంది.మరి మిగితా సామాజిక వర్గం వారికి న్యాయం చేసేది ఎవరూ అంటే సమాధానం మాత్రం లేదు.

గతంలో టీడీపీ పై కూల పార్టీ అంటూ ఆరోపణలు చేసిన జగన్ అండ్ కో పై ప్రతిపక్షం ఇదే రకమైన దాడి చేస్తే దానిని అంగీకరిస్తారా?మరి దీనికి అధికార పక్షం ఏ రకమైన సమాధానం చెబుతుందో అని అందరూ వేచి చూస్తారు.ఇప్పటికే కులం అనే ఈ మహమ్మారి సమాజంలో ఎన్నో అన్యాయాలకు కారణం అవుతుంది.ఇప్పుడు ఇది రాజకీయ నాయకుల పుణ్యమతో ప్రభుత్వ వ్యవస్థలలోకి ప్రవేశిస్తుంది.మరి రానున్న కాలం లో ఈ మహమ్మారి వ్యవస్థలను ఎటు నదిపించబోతుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: