ఆంధ్రజ్యోతి 'ఆర్కే' రాధాకృష్ణను ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. చంద్రబాబు సహకారంతో అంచలంచలు ఎదిగిన పాత్రికేయుడు రాధాకృష్ణ. చంద్రబాబు అండ చూసుకొనే 2002 లో ఆంధ్రజ్యోతి పత్రిక సంస్ధను పునః ప్రారంభించారు రాధాకృష్ణ. ఎప్పుడు చంద్రబాబుకు అండగా, తోడుగా ఉండే పత్రికా ఆంధ్రజ్యోతి. 


ఆంధ్రజ్యోతికి కూడా సపోర్టు ఇచ్చేది చంద్రబాబు నాయుడే లెండి. ఇప్పటికే చంద్రబాబు ఓటమితో పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాధాకృష్ణను జైలుకు పంపించేందుకు తాజా, పాత కేసులన్నీ బయటకు తోడుతున్నారు కొందరు. ఫైనల్‌గా రాధాకృష్ణను జైలుకు పంపడమే వారి టార్గెట్ గా పెట్టుకున్నారు. 


ఓ వైపు చంద్రబాబు ఓటమితో బాధపడుతుంటే మరోవైపు ఇలా అరెస్ట్ వారెంట్‌లు ఇచ్చి రాధాకృష్ణకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కొన్ని చోట్ల ఆఫీసు కూల్చివేతలు కూడా జరుగుతున్నాయి. అక్రమంగా ఆఫీసులు నిర్మించారని నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ రాధాకృష్ణ స్పందించడం లేదు. అయితే తాజాగా ఆర్కేకు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 


రెండేళ్ల క్రితం జగ్గయ్య పేటకు చెందిన సైదేశ్వరరావు తన భూమికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో తప్పుడు కథనం ప్రచురితమైదంటూ ఆర్కేపై పరువునష్టం దావా వేశారు. అయితే ఈ కేసు విచారణకు హాజరుకావాలని పలుమార్లు నోటీసులు పంపిన ఆర్కే హాజరుకాకపోవడంతో కోర్టు ఆర్కేకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మరి దీనికి ఆర్కే ఎలా స్పందిస్తారో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: