తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని రోజుకు ఒకలా ట్విట్ పెట్టి చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నారు. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఒకరిని ఒకరు తిట్టుకుంటూ, అంతర్గతంగా జరిగే గొడవలు అన్ని బహిర్గతం చేశారు ఆ పార్టీ నేతలు. ట్విట్టర్ వేధికగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ విజయవాడ సెంటర్ గా జరిగే గొడవలు అన్ని తెలిసిపోయాయి. 


ఎన్నికల ఫలితాల నుంచి 'అసంతృప్తి'తో ఉన్న నాని రోజుకు ఒకల సోషల్ మీడియా వేదిక వారి పార్టీ వారినే తిట్టేవారు. అలానే ట్విట్ చేస్తూ బుద్ధా వెంకన్న'తో గొడవకు దిగారు. ట్విట్టర్ వేధికగా ఇద్దరు గొడవలు పెట్టుకున్నారు. చివరికి బుద్ధా వెంకన్న తగ్గి 'అధిష్టానం కోసం ఏ ట్విట్ల యుద్ధం అపిస్తున్న' అని ప్రకటించారు. కానీ కేశినేని నాని మాత్రం ఆపడం లేదు. 


కావాలంటే రాజీనామా ఇస్తా కానీ ఈ విమర్శలు మాత్రం ఆపాను అన్నట్టు ట్విట్ చేస్తున్నారు కేశినేని నాని. ఈ నేపద్ధ్యంలోనే ఈరోజు కూడా ట్విట్ చేశారు. ''నేను ఎవరికైనా ఏమి అయినా ఇవ్వాలి అని ఎవరి దృష్టికి వచ్చినా నా వద్దకు తీసుకువస్తే నేను చెల్లించడానికి సిద్దంగా వున్నానని వందల సార్లు చెప్పడం జరిగింది. ఎప్పటికీ దానికి నేను కట్టుబడి వున్నాను. నువ్వు బ్యాంకులకు కట్టవలసిన వేల కోట్లు కడితే దేశానికి మంచి చేసినవాడివి అవుతావు''. ''ప్రబుద్ధుడు'' తో నీకున్న అక్రమ సంబంధం ప్రజలకి అర్థమయింది. అంటూ ట్విట్ చేశారు కేశినేని నాని. మరి ఈ ట్విట్ కి ఏ నేత స్పందిస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: