ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయబోతున్న గ్రామ/వార్డు సచివాలయాల్లో 1,33,867 ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేయబోతుంద. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14,900 గ్రామ/వార్డు సచివాలయాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ గ్రామ/ వార్డు సచివాలయాల్లోని ఉద్యోగాలు పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు. 
 
ప్రతి గ్రామ సచివాలయంలో పంచాయితీ కార్యదర్శి, వీఆర్వో, సర్వే అసిస్టెంట్, ఏ ఎన్ ఎం, వెటర్నరీ లేదా ఫిషరీ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ అసిస్టెంట్, మహిళల రక్షణ ఉద్యోగి, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, అగ్రి, హార్దికల్చర్ ఎంపీఓలు, అవసరం ఉన్నచోట మత్స్యశాఖ ఎంపీఈఓ ఉద్యోగాలు ఉంటాయి. వార్డు సచివాలయాల్లో వార్డు పరిపాలనా కార్యదర్శి, వార్డు సౌకర్యాల కార్యదర్శి, వార్డు విద్యా కార్యదర్శి, పారిశుద్ధ్య - పర్యావరణ కార్యదర్శి, ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శి, సంక్షేమం - అభివృధ్ధి కార్యదర్శి, వార్డు ఇంధన కార్యదర్శి, వార్డు ఆరోగ్య కార్యదర్శి, వార్డు రెవెన్యూ కార్యదర్శి, వార్డు మహిళా, బలహీనవర్గాల పరిరక్షణా కార్యదర్శి ఉద్యోగాలు ఉంటాయి. 
 
రాష్ట్ర ప్రభుత్వం రానున్న పదిరోజుల్లో శాఖల వారీగా నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. డిస్టిక్ సెలక్షన్ కమిటీలు రాత పరీక్షలు నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తాయి. ఉద్యోగాల ఎంపికలో రిజర్వేషన్లు అమలు చేస్తారు. రాష్ట్రంలో ఇంత భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అవుతూ ఉండటంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: