అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ రోజు మంత్రులు, ఎంఎల్ఏల హాజరుపై అసెంబ్లీలో అటెండెన్స్ తీసుకోవాలని నిర్ణయించారు. అందరి అటెండెన్స్ తీసుకునే బాధ్యతను జగన్ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డికి అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

 

తెలుగుదేశంపార్టీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నపుడు అధికార పార్టీ సభ్యులు మాత్రం ఎందుకు హాజరుకావటం లేదన్న విషయాన్ని జగన్ ఆరా తీశారట. మంత్రులంటే ఇటు అసెంబ్లీతో పాటు అటు శాసనమండలిలో కూడా ఉండాలి.

 

అయితే ఎంఎల్ఏలకు ఆ వెసులుబాటు లేదు. కాబట్టి ప్రతీ ఎంఎల్ఏ కచ్చితంగా హాజరై తీరాల్సిందేనంటూ ఆదేశించారు. జగన్ లెక్కప్రకారం అసెంబ్లీకి ఎంఎల్ఏలు హాజరవ్వాల్సిన స్ధాయిలో హాజరవటం లేదట. దాంతో జగన్ కు మండిపోయింది.

 

ఇక మంత్రుల విషయానికి వస్తే అసెంబ్లీలో ఉన్నామని, కౌన్సిల్లో ఉన్నామని చెబుతూ తప్పించుకు తిరుగుతున్నట్లు జగన్ దృష్టికి వచ్చింది. దాంతో మంత్రుల హాజరు విషయంలో కూడా కచ్చితంగా ఉండాలని నిర్ణయించుకుని ఆ బాధ్యతను చీఫ్ విప్ పై ఉంచారు. మరి జగన్ నిర్ణయం ఎలా పనిచేస్తుందో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: