ఈ రోజుల్లో ఏ రాజకీయ నాయకుడైనా సక్సెస్ అవ్వాలంటే దానికి ఒకటే సూత్రం పాదయాత్ర. పాదయాత్ర ద్వారా ఎన్ని అద్భుతాలు చేయొచ్చో జగన్ తాజా ఎన్నికల్లో చేసి చూపించారు. అయితే ఇదే బాటలో చినబాబు లోకేష్ కూడా వెళ్లనున్నాడని తెలుస్తుంది. ఓటమి ప్రభావంతో నిరాశ, నిస్పృహ లో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపటం కోసం నారా లోకేష్ రంగంలోకి దిగుతున్నారు. గతంలో 2014లో చంద్రబాబు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు.


ఇక ఆ తర్వాత మొన్న జరిగే 2019 ఎన్నికల్లో ప్రజా సంకల్ప యాత్ర చేసి జగన్ ప్రస్తుతం అధికారంలో ఉన్నారు . ఇక ఇప్పుడు చిన బాబు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పొలిటికల్ గా తన ఇమేజ్ ను పెంచుకోవడంతో పాటు గా, పార్టీని బలోపేతం చేయాలన్న దిశగా లోకేష్ పాదయాత్ర సాగనుంది. లోకేష్ సాగించే ఈ పాదయాత్రలో షరతులు కూడా వర్తిస్తాయి అని చెబుతున్నారు టిడిపి నాయకులు. రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ చేయనున్న పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్ర గా ఉండబోదని, మధ్య మధ్యలో బ్రేక్ లు ఉంటాయని చెప్తున్నారు.


ఈ సమయంలో సుదీర్ఘ పాదయాత్ర అవసరం లేదని, విడతలవారీగా విరామం తీసుకుంటూ పాదయాత్ర సాగిస్తారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో ఓటమిపాలైన తర్వాత వైసీపీ చేస్తున్న ఎదురు దాడిని ఎదుర్కోవడానికి రంగంలోకి దిగిన లోకేష్ బాబు ట్విట్టర్ వేదికగా వైసీపీ పై ఎదురు దాడి చేస్తున్నాడు. అయితే అదంతా ఎవరితోనో రాయించి పెడుతున్న ట్వీట్ లు అని వైసీపీ నేతలు లోకేష్ ను ఇరకాటంలో పెడుతున్నారు. సరిగా మాట్లాడలేడని, పప్పు అని లోకేష్ పై ప్రచారం చేసి లోకేష్ ను ఒక అసమర్థుడిగా చిత్రీకరించే ప్రయత్నం లో బాగానే సక్సెస్ అయ్యారు వైసిపి నేతలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: