వైసీపీలో అలకలు మొదలయ్యాయి. ఎక్కడైతే డబ్బు, అధికారం, ఆర్భాటం ఉంటాయో అక్కడే అలకలు కూడా ఉంటాయి. విషయానికి వస్తే బడ్జెట్ సమావేశాలు వైసీపీకి మొదటివి. ఆ పార్టీ విధానాలు ప్ర్జలకు తెలియచెప్పేవి. అంతటి కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో కొన్ని వైసీపీ గొంతులు పెగలడంలేదు. ఎందువల్ల...


జగన్ తో పాటు, కొందరు మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నా కూడా  దిగ్గజాల్లాంటి ఎమ్మెల్యేలు ఉలుకూ పలుకూ లేదు. మంత్రి పదవులు దక్కకపోవడమే అలకలకు కారణమట. అ దాంతో సమావేశాల్లో వారి తీరు పై వైసీపీలో పెద్ద చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి జగన్ సైతం ఇలాంటివి ఉపేక్షించనని గట్టిగా చెబుతున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అంతా మాట్లాడాలని, ప్రభుత్వ విధానాలు తెలియచెప్పాలని కూడా ఆయన గట్టిగా కోరుతున్నారు.


మొత్తానికి జగన్ హెచ్చరిక బాగా పనిచేసినట్లుంది. అలక పానుపు దిగిన సీనియర్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గొంతు సవరించారు. ఆనం రామ్ నారాయణరెడ్డి, కొలుసు పార్ధసారధి వంటి వారు అసెంబ్లీలో తమ వాణిని బలంగా వినిపించడం టీడీపీకి ఇరకాటంలో నెడుతూంటే వైసీపీకి కొత్త జోష్ ని ఇచ్చింది. మొన్న ధర్మాన ప్రసాదరావు బడ్జెట్ పై మాట్లాడి  బాబుకు చుక్కలు చూపించారు. మేమూ సీనియర్లమే బాబూ అంటూ ఇపుడు వైసీపీ నుంచి గొంతు లేస్తూంటే షాక్ లో టీడీపీ పడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: