కృష్ణానదీ తీరంలో అక్రమంగా కట్టిన నివాసంలో అద్దెకు ఉన్న మాజీ సీఎం చంద్రబాబు విషయంలో ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో ఏకంగా సినిమా చూపిస్తున్నారు. కరకట్టపై అక్రమ నివాసాల విషయంపై అసెంబ్లీలో చర్చ జరిగిన సమయంలో సీఎం జగన్ ఏకంగా టీవీ తెరపై సంబంధిత ఆధారాలు ప్రదర్శిస్తూ.. చంద్రబాబు నిబంధనల ఉల్లంఘనలను ప్రపంచానికి చాటారు.


చంద్రబాబు స్వయంగా తాను రూల్స్ పట్టించుకోకుండా అక్రమ భవనంలో నివాసం ఉండటమే కాకుండా.. అక్కడే పది కోట్లు వెచ్చింది ప్రజావేదిక నిర్మించారని తెలిపారు. ప్రజావేదిక నిర్మాణం సమయంలో రివర్ కన్జర్వేటర్ కు అధికారులకు జరిగిన ఉత్తర, ప్రత్యుత్తరాలను టీవీ తెరపై ఆవిష్కరించారు. నది ప్రవాహ ఎత్తుకు తక్కువ ఎత్తులో ప్రజావేదిక నిర్మించిన విషయాన్ని గుర్తించారు.


ముఖ్యమంత్రే నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఇక అంతా రెచ్చిపోయారు.. కరకట్ట అంతా అక్రమ కట్టడాలు వెలిస్తే నదీ ప్రవాహం దారి తప్పితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి అక్రమ కట్టడాల కారణంగా కృష్ణా నది దారి తప్పితే.. ఏకంగా విజయవాడ నగరమే మునిగి పోయే పరిస్థితి తలెత్తుతుందని జగన్ అన్నారు.


ఇలా అడ్డగోలుగా నదీ తీరాల్లో నిర్మాణాలు కట్టడం కారణంగానే పట్టణాల్లో అనేక ఆవాసాలు మునిగిపోయే పరిస్థితి వస్తుందని జగన్ అన్నారు. అందుకు ఉదాహరణగా దేశంలోనే అనేక నగరాల విషయాన్ని ప్రస్తావించారు. ఏకంగా చంద్రబాబు నివాసం ఉంటున్న భవనాన్ని అసెంబ్లీలో స్లైడ్ ద్వారా ప్రదర్శించి చూపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: