టీవీ9 ఛానెల్ సీఈఓగా ఒక వెలుగు వెలిగాడు రవిప్రకాశ్. కానీ టీవీ9 ఛానెల్ అమ్మేయటంతో రవిప్రకాశ్ కు కష్టాలు మొదలయ్యయి. టీవీ9 ఛానెల్ లోగోను తన ఛానెల్ అయిన మోజో టీవికి 99 వేల రుపాయలకు అమ్మేయటం, ఫోర్జరీ కేసు, టీవీ9 షేర్లకు సంబంధించిన కేసులు రవిప్రకాశ్ పై టీవీ9 కొత్త యాజమాన్యం నమోదు చేసింది. ఈ కేసులో బెయిల్ పై బయటికి రావటంతో రవిప్రకాశ్ తన భవిష్యత్ కార్యాచరణ సిధ్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. 
 
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రవిప్రకాశ్ తన మిత్రులతో కలిసి టీవీ36 అనే ఛానెల్ ప్రారంభించబోతున్నాడట. ఈ ఛానెల్ తో పాటు  పత్రిక,  వెబ్ మీడియాను ఒకే సారి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. టీవీ 36 ఛానెల్ కోసం ప్రస్తుతం టీవీ9లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి రవిప్రకాశ్ ఛానెల్లో చేరుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ఛానెల్, పత్రిక, వెబ్ మీడియా గురించి అధికారికంగా సమాచారం రాబోతున్నట్లు తెలుస్తుంది. 
 
తెలంగాణలోని ఒక పార్టీకి వ్యతిరేకంగా ఈ ఛానెల్ ను రవిప్రకాశ్ ప్రారంభించబోతున్నారట. కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం కోసమే ఈ ఛానెల్ పెడుతున్నట్లు సమాచారం. అతి త్వరలోనే ఈ ఛానెల్ ప్రారంభం అవుతున్నట్లు తెలుస్తుంది. మరి రవిప్రకాశ్ కొత్త ఛానెల్ ప్రారంభించి సక్సెస్ అవుతాడో లేదో చూడాలి. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: