కృష్ణానదీ తీరంలోని అక్రమ కట్టడాల విషయంలో అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఈ సమయంలో సీఎం జగన్ సీఎం భవనానికి చెందిన అక్రమాల తీరును అసెంబ్లీలో తెరపై ప్రదర్శించారు. అక్రమాల ఉల్లంఘనలకు చెందిన డాక్యుమెట్లను చదవి వినిపించారు.


ఇదే సమయంలో ఈ చర్చకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. నిబంధనలకు అనుగుణంగానే తాను అద్దెకు ఉంటున్న నివాసం నిర్మించారంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తన నివాసం .. బిల్డింగ్ రూల్స్.. బైలాస్ కు అనుకూలంగానే ఉందన్నారు.


ఈ మేరకు కొన్ని డాక్యుమెట్లను చూపారు. సీఎం డాక్యుమెంట్లను టీవీ తెరపై ప్రదర్శించినప్పుడు.. తాను చూపుతున్న డాక్యుమెంట్లు కూడా టీవీ తెరపై ప్రదర్శించాలని స్పీకర్ ను ముందుగానే కోరారు. కానీ ఇందుకు స్పీకర్ అనుమతించలేదు.


ఈ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తూ.. నేను తమరిని అభ్యర్థించాను.. కానీ మీ మనస్సు కరగలేదు... సభలో అందరికీ సమాన అవకాశాలు ఉండాలి.. కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు.. మీరు ఇవ్వలేరు కూడా అన్నారు చంద్రబాబు. ఒకప్పుడు తన ప్రభుత్వంలోని మంత్రిని ప్రస్తుతం చంద్రబాబు అభ్యర్థిస్తున్న దృశ్యం.. ఆసక్తికరంగా కనిపించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: