దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో రాజకీయంగా పోరాడనే తప్పితే వ్యక్తిగతంగా కాదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు . తమ మధ్య ఉన్నది రాజకీయ విరోధమే తప్పితే, వ్యక్తిగత విరోధం కాదని అన్నారు . ఈ విషయం 77-83 సంవత్సరాల  మధ్య మా ఇద్దర్ని స్నేహాన్ని చూసిన వారికీ తెలుస్తుందని , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవచ్చునని ఎద్దేవా చేశారు . మంత్రులుగా తాము ఒకే రూమ్ లో పడుకునే వాళ్లమని చెప్పారు .


కృష్ణా నదీ కరకట్ట అక్రమ నిర్మాణాల కూల్చివేతల పై ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగుతున్న సందర్బంగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రోడ్డు పక్కన ఉన్న విగ్రహాలను తొలిగిస్తారా ? అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తో సభలో గందరగోళం నెలకొంది . రోడ్డు పై విగ్రహాలు ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు . వైఎస్ విగ్రహాలను ఏర్పాటు చేయడం వల్ల కడుపుమంట తో చంద్రబాబు విగ్రహాలను తొలగించాలని కోరుతున్నారని వైకాపా సభ్యులు విమర్శించారు .


 దీనితో వైఎస్ విగ్రహాలుంటే తనకు ఎందుకు కడుపుమంట అని ఎదురు ప్రశ్నించారు .  వైఎస్ తనకు మంచి మిత్రుడు అని గతంలో తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు . కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇద్దరం మంచి స్నేహితులమని , తాను తెలుగుదేశం పార్టీలోకి వచ్చానని, ఆయన కాంగ్రెస్ లో కొనసాగరన్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: