కర్ణాటక అసెంబ్లీలో రసవత్తర ఘట్టం చోటు చేసుకుంటున్నాయి. నేడు బలపరీక్ష నేపథ్యంలో ఏం జరుగుతోందన్న ఉత్కంఠ అంతటా నెలకొంది. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. విశ్వాస పరీక్ష సందర్భంగా సీఎం కుమార స్వామి ప్రసంగించారు.


కర్ణాటక అభివృద్దే తన తొలిప్రాధాన్యమని కుమార స్వామి తెలిపారు. బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. తాను కచ్చితంగా బలం నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.


తమ పరిపాలనపై చాలా మంది ఎమ్మెల్యేలు సంతృప్తిగా ఉన్నారని.. కుమార స్వామి అన్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలను బీజేపీ ప్రోత్సహించి సుప్రీంకోర్టులో కేసులు వేయించిందని కుమార స్వామి ఆరోపించారు. స్పీకర్ అన్ని సమయాల్లోనూ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించారని కర్ణాటక సీఎం అన్నారు.


అయితే.. ఈ సమావేశాలకు బీఎస్పీ ఎమ్మెల్యే గైర్హాజరయ్యారు. ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప.. కుమార స్వామి ప్రభుత్వం బలం నిరూపించుకునే అవకాశం కనిపించడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: