ఎన్నాళ్లకెన్నాళ్లకు అన్నట్టు భారీ వర్షం జిల్లా వాసులను పలకరించి వెళ్ళింది. నీటి తడి అందకా నోళ్లు తెరిచిన భూములకు కాస్త ఊపిరి పోసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారిగా వర్షం కురిసింది. దీంతో శ్రీకాకుళం  నరగంలోని కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాలు, వీదులు జలమయం అయ్యాయి. ఆర్టీసీ ప్రాంగణంలో నీరు నిలిచి ప్రయాణికులు నానా పాట్లు పడుతున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, పిడుగులతో వర్షం కురిసింది. శ్రీకాకుళం నగరంలో పలు ప్రాంతాల్లో వర్షపు నీటితో రహదారులన్నీ స్తంభించిపోయాయి. 

ఆర్టీసీ కాంప్లెక్స్ లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు రాకపోకలుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో సగటు వర్ష పాతం 3.2 మిల్లీ మీటర్లగా నమోదయ్యింది. టెక్కలి డివిజన్ లో 2.4 మిల్లీ మీటర్లు , శ్రీకాకుళం డివిజన్ లో 4.3 , పాలకొండ డివిజన్ లో 2.8 మిల్లీ మీటర్ల  వర్ష పాతం నమోదయ్యింది.

కంచిలి మండలంలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడని వర్షం  అక్కడి ప్రజలను భయబ్రాంతులకు  గురిచేసింది. మండల కేంద్రంలోని కంచిలి పంచాయతీ బలియాపుట్టుగ కూడలి సమీపంలో తాటిచెట్టుపై పిడుగు పడడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి చెట్టు కాలిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: