విద్యుత్ పిపిఏలు, పోలవరం కాంట్రాక్టుల వ్యవహారం చూస్తుంటే తొందరలోనే చంద్రబాబునాయుడుపై సిబిఐ విచారణ జరిపేందుకు రంగం రెడీ అవుతున్నట్లు అనుమానంగా ఉంది. చంద్రబాబు హయాంలో జరిగిన  విద్యుత్ పిపిఏల్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

 

తాజాగా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుల్లో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిందని నిపుణుల కమిటి నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. పోలవరం పనుల్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగింది ? ఎన్ని కోట్ల అవినీతి జరిగిందనే వివరాలతో ఓ నివేదికను జగన్మోహన్ రెడ్డికి నిపుణుల కమిటి అందచేయనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అవకతవకలు జరిగాయని, అవినీతి జరిగిందని మాత్రమే కమిటి చెప్పగలదు.   

 

అయితే తెరవెనుక జరిగిన యవ్వారాలు బయటకు రావాలంటే మాత్రం సిబిఐ విచారణ జరపటం ఒక్కటమే మార్గం. అందులోనే ప్రాజెక్టుకు అవసరమైన నిధులంతా కేంద్రమే విడుదల చేస్తోంది. అందుకనే నిపుణుల కమిటి నుండి తనకు నివేదిక అందగానే అదే నివేదికను జగన్ కేంద్రానికి పంపనున్నట్లు సమాచారం. జరిగిన అవినీతి బయటపడాలంటే సిబిఐ విచారణ ఒక్కటే మార్గంగా చెబుతూ జగన్ సిబిఐ విచారణ కోరబోతున్నారని తెలుస్తోంది.

 

ఎన్నికల సమయంలో గుంటూరు సభలో నరేంద్రమోడి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటిఎంగా వాడుకున్నట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. అంటే కేంద్రం కూడా చంద్రబాబుపై విచారణకు రెడీగానే ఉంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుండి సిఫారసు అందాలి.  ఆ సిఫారసు కోసమే వెయిట్ చేస్తోంది. ఆ ముచ్చట గనుక జగన్ పూర్తి చేస్తే కేంద్రం సిబిఐ విచారణ ప్రకటించటమే తరువాయిగా తెలుస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి: