పాలకొండలో బీసీ బాలికల వసతి గ్రుహాలు ఏర్పాటు చేయాలంటూ విద్యార్థిణులు నినాదించారు. ఎందరికి చెప్పినా .. ఎన్నిసార్లు విన్నపించుకున్నా తమ గోడు పట్టించుకోవటం లేదంటూ ఆందోళనకు దిగారు. ఆర్డీవో కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి తమ డిమాండును హొరేత్తించారు. తమ చదువులకు చేయూతనివ్వాలని అధికారులకు విన్నమించుకున్నారు. 

చదువుకునేందుకు వసతి కోసం ఆ విద్యార్థిణులు చేయని ప్రయత్నం లేదు. అధికారుల చుట్టూ తిరిగారు. ప్రజా ప్రతినిధులకు తమ  సమస్య తెలియజేసి పరిష్కరించాలని ప్రాధేయపడ్డారు. జిల్లాస్థాయి ఉన్నతాధికారులను వేడుకున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో సమస్య పరిష్కరించాలంటూ వందలాదిమంది విద్యార్థులు రోడ్డెక్కారు. 

పాలకొండలో కళాశాల బాలికల వసతి గ్రుహం కొనసాగించాలని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారు.  మండుటెండను సైతం లెక్కచేయకుండా ఆందోళనకు దిగారు. స్థానిక ఎంఎంనగర్ కూడలి నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి కార్యాలయాన్ని ముట్టడించారు. తమ సమస్య పరిష్కరించాలని నినాదాలు చేశారు. గ్రామీణ  ప్రాంతాల నుంచి పాలకొండలో తాము చదువుకోడానికి వస్తున్నామని , తమకు వసతి గ్రుహాల్లేక ఇబ్బందులు పడుతున్నామి , తమకు వసతి గ్రుహాలు కల్పించాలని అధికారులను కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: