శ్రీకాకుళం కాలనీ ప్రజలు అప్పుడే నిద్రలేస్తున్నారు .. కొందరు ఇంకా నిద్రలోనే ఉన్నారు! ఒక్కసారిగా అనుకోని రీతిలో 120 మందికి పైగా పోలీసులు అక్కడికి వచ్చారు. ఏం జరుగుతుందో ఊహించేలోపే..ఇంటింటికి వెళ్లారు! ఎవరూ బయటకు వెళ్లకుండా ఆ ప్రాంతంలో బందోబస్తు కొనసాగింది !! పోలిసులు ప్రతి ఒక్కరి వివరాలు ఆరా తీశారు. ద్రువీకరణ పత్రాలు పరిశీలించారు. అందరి  సమాచారాలను నమోదు చేసుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

అనుమానితులను అదుపులోనికి తీసుకున్నారు.
జిల్లా కేంద్రంలోని వాంబేకాలానీని  పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. పోలీసులు  నాకాబందీ (కార్డెన్ సెర్చ్)ని ప్రారంభించారు. ఎస్పీ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం డీఎస్పీ చక్రవర్తి, ఎస్సీ, సెల్ డీఎస్పీ సత్యనారాణలతో పాటు  సీఐ, ఎసై స్థాయి అధికారులు , ఎఆర్ , ఎస్టీఎఫ్ సిబ్బంది మొత్తం 186 మంది ఇందులో పాల్గొన్నారు. వాంబే కాలనీలోని ప్రతీ ఇన్నిటికి వెళ్లి ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి ఆధార్ కార్డును తనిఖీ చేశారు. 

ఎంతమంది ఉంటున్నారు, ఏయే పనులు చేస్తున్నారు, వాహనాలకు సంబంధించి  పత్రాలు లేనివాటిని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్బంగా డీఎస్పీ చక్రవర్తి మాట్లాడుతూ అసాంగిక శక్తులు ప్రవేశించే సమయాల్లో ఇలాంటి తనిఖీలు చేస్తాతామని, ఎస్పీ ఆదేశాల మేరకు దీన్ని నిర్వహించామని తెలిపారు. అనుమానిత వ్యక్తులు తారసపడితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని  కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: