ద‌శాబ్దమున్న‌ర క్రితం tv9 పేరిట‌ 24 గంటల న్యూస్ ఛానల్‌ను ప్రారంభించి తెలుగు మీడియారంగంలో కొత్త చ‌రిత్ర‌కు శ్రీ‌కారం చుట్టాడు జ‌ర్న‌లిస్టు ర‌విప్రకాష్‌. tv9 సీఈవోగా రాష్ట్రంలోనే కాక, దేశంలోనే ఒక ఊపు తీసుకొచ్చిన రవిప్రకాష్.. అనూహ్య ప‌రిణామాల అనంత‌రం తాజాగా కొత్త చాన‌ల్‌కు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నాడు. 
నిజానికి టీవీ9 ఛానల్ విజ‌యం సాధించ‌డంలో ర‌విప్రకాష్‌దే కీల‌క‌పాత్ర అని చెప్ప‌వ‌చ్చు. ఆ చాన‌ల్‌ను తిరుగులేని సంచ‌ల‌నంగా మార్చారు. ఏదో ముప్పు వస్తుందని గ్రహించి, కొద్ది నెలల క్రితమే మోజో టీవీ అని మరొక న్యూస్ ఛానల్ కూడా మొదలు పెట్టించారు. అయితే అనూహ్యంగా అలందా మీడియా ఎంటర్ అవ్వటం, టీవీ9, మోజో టీవీని హస్తగతం చేసుకోవటం, రవి ప్రకాష్‌ని బయటకు గెంటేయటం జరిగిపోయాయి.   

Image result for tv9 ravi prakash

వీటన్నిటికీ కారణం, మైహోమ్స్ రామేశ్వర రావు, మేఘా కృష్ణా రెడ్డి అని విమర్శలు చేసాడు రవి ప్రకాష్. తెలుగు మీడియాను వీరు కబ్జా చేస్తున్నారని, ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరుగుతుందని, మిగతా చానల్స్ కూడా లాక్కునే ప్లాన్ లో వీళ్ళు ఉన్నారని ఆరోపించారు. రవి ప్రకాష్ ఆరోపించినట్టుగానే, ఇటీవ‌ల మోజో టీవీని కూడా స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రిందట ఆ ఛానెల్ సీఈఓ రేవతిని కూడా, పాత కేసులో అరెస్ట్ చేసారు. అయితే కేసుల్లో ఇరుక్కుని, ఇబ్బందుల్లో ఉన్న రవి ప్రకాష్ ఏమి చేయ‌లేని పరిస్థితి. ఈ స‌మ‌యంలోనే హైకోర్ట్ లో రవిప్రకాష్ కు ఊరట లభించింది. రవి ప్రకాష్ కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో రవిప్రకాష్ త‌న ఫ్యూచ‌ర్ ప్లాన్‌పై దృష్టిపెట్టిన‌ట్టు తెలుస్తోంది. 

https://youtu.be/6Wj_HhG6ssg

ఈ నేపధ్యంలోనే, టీవీ9 మాజీ ఉద్యోగి జాకీర్ తాజాగా సోష‌ల్ మీడియాలో లైవ్ వచ్చి ర‌విప్ర‌కాష్ కొత్త చాన‌ల్ గురించి కొన్ని వివ‌రాలు తెలిపాడు. రవిప్రకాష్ కొత్త టీవీ చాన‌ల్ పెట్ట‌బోతున్నాడ‌ని ప్ర‌క‌టించాడు జాకీర్.   మిగ‌తా వివరాలు త్వరలోనే చెప్తామని ప్రకటించాడు. టీవీ చాన‌ల్ పేరు టీవీ36 అని చెప్ప‌క‌నే చెప్పాడు. ఇక్కడ కూడా 3+6 = 9 వచ్చేలా జాగ్రత్త తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. బంజారాహిల్స్ రోడ్‌నం.2లో భారీ ఎత్తున చాన‌ల్‌కు సంబంధించిన వ‌ర్క్ జ‌రుగుతున్న‌ట్టు జాకీర్ తెలిపాడు. రవిప్రకాష్ పడుతున్న ఇబ్బందులు అన్నీ చెప్పుకొచ్చాడు జ‌కీర్. జాకీర్ మాట‌లు వింటే, రవిప్రకాష్‌తో జకీర్ టచ్ లో వున్నాడ‌నో, లేదా రవిప్రకాష్ మాట మేరకే ఆయన ఈ లైవ్ లోకి వచ్చి ఈ విశేషాలు అన్నీ చెప్పారని భావించాల్సి వస్తోంది. అయితే చాన‌ల్ ఎలా ఉండబోతోంది, రవిప్రకాష్ ఆలోచనలు, కార్యాచరణ ఎలా వున్నాయి? ఇవన్నీ జకీర్ తనకు అందిన సమాచారం అన్నట్లుగా తెలిపాడు. జకీర్ తన మాటల్లో ఓ మాట కూడా అన్నారు. బీజేపీ తెలంగాణలో అధికారం చేపట్టాలని ప్రయత్నిస్తోంది. అందువల్ల రవిప్రకాష్ బీజేపీ మద్దతుతో చాన‌ల్ పెడుతున్నారా? లేక రవిప్రకాష్ తన మద్దతును బీజేపీకి అందిస్తారా? అన్న పాయింట్ ను జాకీర్ లేవనెత్తడం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

Image result for tv9 ravi prakash

అయితే రవి ప్రకాష్ కు బీజేపీ అండదండలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయని, రవిప్రకాష్ కంప్లైంట్ మేరకే, మొన్న మైహోం రామేశ్వరరావు పై ఐటి దాడులు జరిగాయని చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టు తెలిపాడు. ఇప్పటికే కేసిఆర్ పై బీజేపీ వార్ ప్రకటించిందని, ఈ నేపధ్యంలో రవిప్రకాష్ తో బీజేపీ పెద్దలు న్యూస్ ఛానెల్ పెట్టిస్తున్నారు అనే ప్ర‌చారం కూడా వినిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: