అసెంబ్లీలో గడచిన ఐదు రోజులుగా జరుగుతున్న తంతు చూస్తున్న వారికి ఇదే అనుమానాలు వస్తున్నాయి. ప్రజా సమస్యల చర్చకు, పరిష్కారానికి ఏర్పాటు చేసిన వేదికే అసెంబ్లీ.  అలాంటి అసెంబ్లీలొనే ప్రజా సమస్యల చర్చకు కాకుండా అనవసర విషయాలపై చర్చకు ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఏమనాలి ?

 

ఇపుడు అసెంబ్లీలో జరుగుతున్నదే. ఐదు రోజుల సమావేశాల్లో జరిగిన అర్ధంతమైన చర్చల కన్నా జరిగిన రచ్చే చాలా ఎక్కువ.  అసెంబ్లీలో చంద్రబాబునాయుడు పక్కన ఎవరు కూర్చోవాలి ? ప్రశ్నోత్తరాల సమయంలో  మాట్లాడే అవకాశాలు ఎవరెవరికి ఇవ్వాలి ?  ఏ అంశం మీద చర్చ జరిగినా చివరగా సిఎం లేదా మంత్రులు సమాధానం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైనా మాట్లాడొచ్చా ? అనే చిన్న విషయాలపైనే చంద్రబాబు, టిడిపి ఎంఎల్ఏలు నానా రచ్చ చేస్తున్నారు.

 

నిజానికి చంద్రబాబు అయినా ఇతర టిడిపి సభ్యులైనా పై విషయాలపై సభలో అనవసరమైన చర్చకు పట్టుబట్టడం లేదా చాలాసేపు రచ్చ చేయటం చూస్తుంటే ఉద్దేశ్యపూర్వకంగానే  చేస్తున్నట్లు తెలిసిపోతోంది. పై అంశాలపై ఇపుడు టిడిపి సభ్యులు రచ్చ చేయటం అనవసరం. ఎందుకంటే, ఎవరు పక్కన ఎవరు కూర్చోవాలి, ప్రశ్నోత్తరాల సమయంలో ఎవరెవరికి మాట్లాడే అవకాశం వస్తుంది, ప్రభుత్వం వైపు నుండి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రతిపక్ష నేత మాట్లాడొచ్చా ? అనేక అంశాలపై నిబంధనలే ఉన్నాయి.

 

సభలో చంద్రబాబు లేవనెత్తుతున్న అంశాలకు  సమాధానాలు టిడిపికే బాగా తెలుసు. తాను ముఖ్యమంత్రిగా ఉంటే నిబంధనలు ఒకలాగ, ప్రతిపక్షంలోకి వస్తే మరోలాగ వక్రీకరించటం, వాదించటం చంద్రబాబుకు బాగా అలవాటే. అధికార పార్టీ దెబ్బకు నోరు పడిపోతున్న చంద్రబాబు అండ్ కో ఏమీ సమాధానాలు చెప్పటం కుదరకే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకే కావాలనే రచ్చ చేస్తున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: