ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినేట్ మీటింగ్లో కేబినేట్ కొన్ని కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేబినేట్లో అమోదం తెలిపిన అంశాలేమిటంటే గ్రామ/ వార్డు సచివాలయాల్లో 1,33,867 ఉద్యోగాల నోటిఫికేషన్ కు కేబినేట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లదాకా ఉచిత విద్యుత్ కు ఆమోదం తెలిపింది. అక్వా రైతులకు రుపాయిన్నరకే విద్యుత్ ఇవ్వటానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. 
 
అంగన్వాడీల జీతాల పెంపుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అంగన్ వాడీ వర్కర్లకు పెంచిన జీతాలు జులై నెల నుండి వర్తింపజేయటానికి ఆమోదం తెలిపింది.మధ్యపాన నిషేధం దిశగా ప్రభుత్వమే మధ్యం దుకాణాలు నిర్విహంచేలా కేబినేట్ నిర్ణయం తీసుకుంది . గ్రామ వాలంటీర్ల, గ్రామ సచివాలయ వ్యవస్థల్ని కేబినేట్ ఆమోదించింది. 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ నియామనికి,పట్టణాల్లో వార్డు వాలంటీర్ల నియామకానికి, వాలంటీర్లకు నెలకు 5వేలు ఇచ్చేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. 
 
చిత్తూరు జిల్లాలోని విక్రుతమాల గ్రామంలో ఎలక్ట్రిక్ ఉత్పత్తుల తయారీ ప్లాంట్ కోసం 149 ఎకరాలు ఏపీఐఐసీకి అప్పగించటానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. భూముల రికార్డుల్లో యజమానులకే శాస్వతంగా హక్కులు ఉండేలా రూపొందించిన బిల్లుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. కౌలు రైతులకు సాగు ఒప్పందం చేసుకునే బిల్లును రూపొందించి ఆ బిల్లుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: